రానా హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఈ చిత్రంలో పంచెకట్టుతో జోగేంద్రగా రానా సూపర్ లుక్ లో కనబడుతున్నాడు. ఈ చిత్రంలో రానా, కాజల్, కేథరిన్ లతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో కేవలం తనకి జోగేంద్ర పాత్ర నచ్చబట్టే చేసానని..... డైరెక్టర్ తేజ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవ్వరూ ఈ సినిమా చెయ్యరని... కానీ తేజ చెప్పిన కథలోని జోగేంద్ర పాత్రకి బాగా కనెక్ట్ అయ్యి ఈ సినిమా లో నటించానని నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి జరిగిన 'నేనే రాజు నేనే మంత్రి' 'జోగేంద్ర యువగర్జన' వేదికపై నిలబడి మరీ రానా చెప్పిన మాటలివి.
ఇక సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ ఉంటుందని... అలాగే చాలా సన్నగా కనబడతానని కూడా చెబుతున్నాడు. ఆ కేరక్టర్ లోని వేరియేషన్స్ కే తాను టెంప్ట్ అయ్యానని చెబుతున్న రానా ఈ సినిమా కోసం సింగిల్ పైసా తీసుకోలేదట. అలాగేలాగా... అని అంటే తన తండ్రి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాబట్టి తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని... ఒకవేళ తాను గనక ఈ సినిమాకి ఛార్జ్ చేస్తే తనకి ఇంట్లో అన్నం కూడా పెట్టరని చెబుతున్నాడు. ఇక సినిమాలోలాగా రానా ఈ ఈవెంట్ కి కూడా పంచెకట్టుతో హాజరై అభిమానులని అలరించాడు.