అనుష్క స్లిమ్ లుక్ నిజమా?

Update: 2017-11-28 10:00 GMT

అనుష్క ఎత్తుకు తగ్గట్టుగా మొదటినుండి కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ.. అందంగానేఉండేది. అలాగే చారిత్రాత్మక చిత్రాల్లో హీరోయిన్ గా అనుష్క నే బెస్ట్ ఆప్షన్ గా ఉండేది.ఇకపోతే ఎత్తైన హీరోలు ప్రభాస్, నాగార్జున ఇలా ఆ హీరోలపక్కన అనుష్క సూపర్ గా సెట్ అయ్యేది. బాహుబలిలో దేవసేనగా అందంగా కనబడిన అనుష్క ఆ సినిమా మధ్యలో తన ఫ్రెండ్ ప్రకాష్ కోసం సైజ్ జీరో సినిమా చేసింది. ఆ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిపోయింది ఈ యోగ భామ.

పాపం అప్పటినుడి ఇప్పటివరకు అనుష్క మళ్ళీ బాహుబలి దేవసేనగా పార్ట్ 1 లో కనబడినట్లుగా కనబడలేదు. ఇక బాహుబలి లో అనుష్కని సన్నగా చూపెట్టడానికి గ్రాఫిక్స్ వాడాల్సి రావడమేకాదు... ఇప్పుడు అనుష్క నటించిన భాగమతి కోసం కూడా ఐదు కోట్ల గ్రాఫిక్ వర్క్ చేయించినట్లుగా ఆ సినిమా డైరెక్టర్ అశోక్ చెప్పాడు. అయితే అనుష్క పెంచిన బరువు తగ్గించడానికి నానా కష్టాలు పడుతుంది. చివరిగా కేరళ వైద్యాన్ని సంప్రదించి కొన్నాళ్ళు జనాలకు కనబడకుండా పోయింది.

అయితే ఇప్పుడు తాజాగా అనుష్క స్లిమ్ లుక్ కనబడుతున్న ఒక ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటోని అనుష్కనే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ లుక్ లో కొత్త అందంతో, బాబ్డ్ హెయిర్ తో సరికొత్త అనుష్కగా కనిపిస్తోంది. ఆ ఫొటో తో పాటే ఆమె ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. 'మంత్ర, తంత్రాల ద్వారా కలలు నిజ రూపం దాల్చవు. అది సాధ్యం కావాలంటే చెమట చిందించాలి. కష్టించే తత్వం, పట్టుదల, ధృడ సంకల్పం అవసరం' అని పేర్కొంది. మరి నిజంగానే అనుష్క పోస్ట్ చేసిన కామెంట్ చూస్తుంటే అనుష్క బరువు తగ్గడానికి ఎంతగా కష్టపడిందో ఆ ఫోటోలో తెలుస్తుంది. అయితే నిజంగా అనుష్క బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి వచ్చేసిందా... ఇది నిజమేనా అనే డౌట్ కూడా కొడుతోంది.

Similar News