అనుష్క పెట్రోల్ అమ్మిందా?

Update: 2018-02-05 07:00 GMT

బాహుబలి హిట్ తర్వాత భాగమతి తో బంపర్ హిట్ అందుకున్న అనుష్క చేతిలో సినిమాలు మాత్రం లేవు. అసలు అనుష్క సినిమాలు చేస్తుందో.. మానేస్తుందో అనేది కూడా కాస్త కన్ఫ్యూషనే. ఎందుకంటే ఈ మధ్య అనుష్క కి సినిమాల ఇంట్రెస్ట్ తగ్గిందో ఏమో తన దగ్గరకు వచ్చిన ప్రాజెక్టులను సైతం వెనక్కి పంపేస్తుందనే టాక్ ఉంది. ప్రస్తుతం భాగమతి ప్రమోషన్స్ లో ఉన్న అనుష్క ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొడుతూ జనాలకు షాక్ ఇచ్చింది. అయితే అనుష్క పెట్రోల్... బళ్ళలో ఎందుకు నింపింది అనుకుంటున్నారా.

అదేనండి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో వస్తున్న మేము సైతం ప్రోగ్రాం కోసం అనుష్క ఇలా పెట్రోల్ నింపే పనిని చేపట్టింది. సోషల్ కాజ్ కోసం మంచు లక్ష్మి హోస్ట్ గా జెమినీ లో ప్రసారం అవుతున్న మేము సైతం 2 ప్రోగ్రాం కోసం అనుష్క ఇలా పెట్రోల్ బంక్ లో ఒకరోజు పనిచేసి తనకి వచ్చిన సొమ్ముతో పాటే తానో కొంత మొత్తాన్ని ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందన్నమాట. అందులో భాగంగానే అనుష్క హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో పెట్రోలు అమ్మిన విషయం బయటికొచ్చింది. అదండీ అందమైన స్వీటీ పెట్రోల్ అమ్మడం వెనక ఉన్న కారణం.

Similar News