అనుష్క నెక్స్ట్ సినిమా అదేనా?

Update: 2017-10-30 08:00 GMT

'బాహుబలి' సీరీస్ లో దేవసేనగా ఇరగదీసిన అనుష్క ఆ సినిమా తర్వాత ఏ ఒక్క కొత్త సినిమాని ఒప్పుకోలేదు. ప్రస్తుతం అనుష్క 'బాహుబలి' కంటే ముందు ఓకే చేసిన 'భాగమతి' లో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే డిసెంబర్ లో విడుదలైతే అనుష్క చేతిలో ఎటువంటి ప్రాజెక్ట్ ఉండదు. అయితే ఎటువంటి సినిమాలకు సైన్ చెయ్యకుండా ప్రస్తుతం నాచురల్ పద్ధతుల్లో తన బరువు కరిగించుకునే పనిలో అనుష్క బిజీగా ఉన్నట్లు, దానికోసమే కేరళ వెలుతున్నట్టుగా అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు అనుష్క రీసెంట్ గా ఒక లేడీ ఓరియెంటెడ్ కథ కి ఓకే చెప్పింది అని అంటున్నారు.

అయితే ఆ సినిమా దర్శకుడు ఎవరో కాదు గౌతం మీనన్ అంటున్నారు. లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన గౌతం మీనన్ అనుష్క కి ఒక కథ వినిపించినట్లుగా.. దానికి అనుష్క కూడా ఒకే చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇంతకుముందే మంచి కథ, ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని అనుష్క ప్రకటించిన నేపధ్యంలోనే ఈ లేడీ ఓరియంటెడ్ కథ చెప్పిన గౌతం మీనన్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ఆమె చేతిలో 'భాగమతి' అనే సినిమా తప్ప వేరే సినిమాలేవి లేవు. గత కొంత కాలంగా అనుష్క కథలు వింటున్నగాని వేటిని ఒప్పుకోవడం లేదు.

ఇటువంటి టైం లోనే దర్శకుడు గౌతం మీనన్ కథ, కథనాలు కొత్తగా అనిపించడం... ఈ కథలోని ఈ తరహా పాత్రను తాను చేయకపోవడం వల్ల అనుష్క... గౌతం మీనన్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఏకకాలంలో తెలుగు తమిళంలో తెరకెక్కనుందంటున్నారు.

Similar News