బాహుబలి తరువాత అనుష్క నటిస్తున్న మూవీ భాగమతి. అనుష్క గతంలో నటించిన అరుంధతి తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో ఈ మూవీ లో నటించింది అని ఫిలిం నగర్ టాక్. పిల్ల జమిందార్ ఫేం అశోక్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన భాగమతి టిజర్ సినిమా పై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండాగా విఎఫెక్స్ పనుల వలన విడుదల లెట్ అవుతూ వస్తుంది.
ఇకపోతే యువి క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ లో ఆది ఒక కీ రోల్ లో నటించాడు. అయితే ఈ సినిమాలో ఆది పాత్రను డిఫరెంట్ షేడ్స్ తో తీర్చిదిద్దాడట దర్శకుడు అశోక్. ఇక ఈ మూవీ లో ఆది యాక్టర్ గా తెలుగు ఇండస్ట్రీ లో సెటిల్ అవ్వడం ఖాయం అని మూవీ యూనిట్ ధీమా ని వ్యక్తం చేస్తుంది. అలాగే అనుష్క తరువాత ఆది క్యారెక్టరే ఈ మూవీ లో చాలా ఇంపార్టెంట్ అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాతో పాటు ఆది ఇప్పటికే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీలో, రామ్ చరణ్ రంగస్థలం సినిమాల్లో కీ రోల్ లో నటిస్తున్నాడు. జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నఈ భాగమతి కి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.