త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కి అంత వెయిట్ ఇవ్వడు. అలానే అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకున్నాడు. అందులో కీర్తి సురేష్ ఒకరు. రెండో హీరోయిన్ అను ఇమాన్యుయేల్. అయితే అను ఇమ్మాన్యువల్ ని సెకండ్ హీరోయిన్ అనుకున్నారు అంతా. కానీ అజ్ఞాతవాసి రిలీజ్ టీజర్ చూస్తుంటే కీర్తి సురేష్ కు అను ఎమాన్యుయేల్ కు సమానమైన ఫుటేజీ లభించింది అనిపించేలా ఉంది. అలానే అందులో పాటలు చూసుకుంటే.. 'గాలివాలుగా' పాట కీర్తికి కాగా, 'బయటకొచ్చి చూస్తే'ని అను, పవన్‌ల మీదే చిత్రీకరించారు. మరో పాట వీరి ఇద్దరి మీద ఉంటుందని... ఆ పాట వింటేనే అర్ధం అవుతుందని అంటున్నారు.
కీర్తి సురేష్ మలయాళీ అమ్మాయి అయినా..ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళంలోనే. అను ముందు నుండి చిన్న సినిమాలు చేసుకుంటూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో, త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కోటేసింది. అజ్ఞాతవాసి సినిమాలో ఈ ఇద్దరూ స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.
లేటెస్ట్ గా జరిగిన ఆడియో ఫంక్షన్ లో అను ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ..నాకు త్రివిక్రమ్ గారితో మళ్లీ వర్క్ చేయాలనుంది అని తన మనసులో మాట బయట పెటేసింది. హీరోయిన్లని రిపీట్ చేసే అలవాటున్న త్రివిక్రమ్ ఈమెని మరికొన్ని సినిమాల్లో సెలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.