అదేమిటండి అలా అనేశాడు!

Update: 2017-08-08 12:00 GMT

నితిన్ తాజా చిత్రం 'లై' వచ్చే శుక్రవారమే విడుదల కాబోతుంది. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ మొదటిసారి అర్జున్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించడం... అలాగే ఒక కొత్త హీరోయిన్ మేఘ ఆకాష్ టాలీవుడ్ కి పరిచయం కావడమే కాదు ఈ చిత్రంలో నితిన్ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఇంతకుముందు నితిన్ వరుస విజయాలు కూడా సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి.

అయితే 'లై' చిత్రం ప్రమోషన్ లో భాగంగా నితిన్ చాలా విషయాలు మీడియా మిత్రులతో పంచుకుంటున్నాడు. అయితే నితిన్ తన సినిమా 'హార్ట్ ఎటాక్' దర్శకుడు పూరి జగన్నాధ్ గురించిచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. పూరి జగన్నాధ్ తాను సినిమాలో ఏది చూపించాలంటే అదే చూపిస్తాడు. అవి కొన్ని సార్లు ఘోరమైన ప్లాపవుతాయి... మరికొన్నిసార్లు సూపర్ హిట్స్ అవుతుంటాయి. అయితే నితిన్, పూరి కాంబోలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమా తర్వాత వీరి కాంబోలో మరో మూవీ ఉంటుందని అన్నారు. కేవలం అనడమే కాదు ఆ సినిమా షూటింగ్ కూడా మొదలెట్టాకే కొన్ని కారణాల వలన బ్రేక్ పడింది. అయితే పూరి అదే కథతో వరుణ్ తేజ తో 'లోఫర్' తీసి భారీ ప్లాపిచ్చాడు.

ఆ తర్వాత మరో కొత్త కథతో పూరి డైరెక్షన్ లో మీరు సినిమా చేస్తారన్నారు కదా అని నితిన్ మీడియా మిత్రుడొకరు అడగగా... దానికి నితిన్.. పూరి తో ఒక కథను చర్చించాం? కాని పూరి గారు చెప్పిన కథ ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు కొత్తగా డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్ అంటూ మాట్లాడాడు. అంటే నితిన్ పూరి తో సినిమా చెయ్యడం ఇష్టం లేక ఆ కథ వెస్ట్ అన్నాడా? లేకుంటే నిజంగానే ఆ కథ నితిన్ కి నచ్చలేదా? అంటూ కొత్త చర్చకు తెరలేపారు కొందరు.

Similar News