అదీ అజ్ఞాతంలోనే ఉండి చేసింది!!

Update: 2017-07-05 13:00 GMT

ఆ మధ్యన సాంఘీక మాధ్యమాలలో టాలీవుడ్, కోలీవుడ్ నటీనటుల పర్సనల్ వీడియోస్ ని పెట్టి గుండెలు గుభేల్ మనిపించింది సింగర్ సుచిత్ర, ప్రస్తుతం అజ్ఞాత వాసం గడుపుతుంది. కోలీవుడ్ లో ప్రముఖులుగా చలామణి అవుతున్న స్టార్స్ పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారో అని వారి వీడియోస్ ని అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారికి నిద్ర లేకుండా చేసింది. అవికూడా పార్టులు పార్టులు గా విడుదల చేస్తూ వచ్చేది. ఎప్పుడు ఎవ్వరి వీడియో బయటికి వస్తుందో తెలియక స్టార్స్ అంతా గుండెలు అరచేతిలో పట్టుకుని భయపడి చచ్చారు.

మళ్ళీ నిన్నగాక మొన్న సూచి లీక్స్ పార్ట్ 2 అంటూ మరో హీరోయిన్ పర్సనల్ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సింగర్ సుచిత్ర మళ్ళీ వార్తల్లోకొచ్చింది. చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన సుచిత్ర ఇప్పుడు యూట్యూబ్ లో ప్రత్యక్షమయింది.యూట్యూబ్ లో సుచిత్ర ఒక రొమాంటిక్ సాంగ్‌ను హృదయానికి అత్తుకునేలా ఆలపించి అందరిని మత్తులో ముంచేసింది. ‘అన్బుల్లా మాన్ విళియే..’ అనే పాటను సుచిత్ర పాడి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. అయితే సుచిత్ర నవీన్ సామ్సన్ బెంజమిన్ అనే మ్యుజీషియన్ ఆధ్వర్యంలో ఈ పాట పాడి అందరిని అలరించింది.

మరి ఎవరికీ దొరక్కుండా ఇన్ని రోజులు అజ్ఞాతంలోనే గడిపిన సుచిత్రకు అసలు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా కరువైపోయాయి. కానీ ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ లో చూసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా పిలిచి మళ్ళీ అవకాశం ఇస్తారేమో చూద్దాం. అయినా అలా అవకాశం వచ్చినా కూడా సుచిత్ర ఇండస్ట్రీలోని చాలామందిని పేస్ చెయ్యాల్సి ఉంటుంది. ఇక సింగర్ సుచిత్ర ఇలా పర్సనల్ వీడియోస్, ఫొటోస్ లీక్ చెయ్యడం వెనుక ఏదో పెద్ద శక్తే ఉందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Similar News