సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.... బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా.. లండన్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన '2.0' సినిమాని దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా.. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాడు. 400 కోట్ల పైమెరే భారీ బడ్జెట్ తో తమిళ బడా ప్రొడక్షన్ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా నిర్మించారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో తెరకెక్కించిన ఈ సినిమా ఆడియో వేడుక దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో గత రాత్రి(శుక్రవారం) దుబాయ్ వాసుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విధంగా కళ్లు మిరిమిట్లు గొలిపేలా అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ '2.0 'ఆడియో వేడుకలో ఏ ఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ తో సహా తెలుగు వెర్షన్ కి రానా, తమిళ వెర్షన్ కి ఆర్ జె బాలాజీ, హిందీ వెర్షన్ కి కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యహరించారు. ఏ ఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ ఈ వేడుకకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. రానా, కరణ్ జోహార్, ఆర్ జె బాలాజీ లు చేసిన వ్యాఖ్యానం కూడా అతిధులను బాగా ఎంటర్టైన్ చేసింది. అయితే దుబాయ్ లో జరిగిన ఈ ఆడియో వేడుకని ఏ టివి ఛానల్ లైవ్ టెలికాస్ట్ చెయ్యలేదు. ఎందుకంటే ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ ను 110 కోట్ల భారీ మొత్తానికి జీ గ్రూప్ సొంతం చేసుకుంది కాబట్టి... ఈ ఆడియో వేడుకని ఆయా భాషల్లోని జీ గ్రూప్ ఛానల్స్ తర్వాత టీవీల్లో ప్రసారం చేస్తాయని సమాచారం.