అది.. ఇది.. సేమ్ టు సేమ్!

Update: 2017-12-22 11:41 GMT

పన్నెండేళ్ల క్రితం వచ్చిన మనసంతా నువ్వే సినిమా గుర్తుందా.. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. అయితే అప్పుడెప్పుడో వచ్చిన మనసంతా నువ్వే సినిమా మాత్రం ఈరోజు శుక్రవారం రిలీజైన హలో సినిమా చూస్తే గుర్తుకురాక మానదు. అవును.. మనసంతా నువ్వే సినిమాకు హైటెక్ వెర్షన్ లా ముస్తాబైంది అఖిల్ నటించిన హలో సినిమా.

ఆ మనసంతా నువ్వే సినిమాలో చిన్నప్పుడే హీరోహీరోయిన్లు దూరమైపోతారు. క్లయిమాక్స్ లో ఉదయ్ కిరణ్, రీమా సేన్ లు కలుసుకుంటారు. ఇద్దరికీ ఆధారంగా ఓ చిన్న వాచ్ ఉంటుంది. సినిమాలో వాళ్లు కలుస్తారు. కానీ వాళ్లే చిన్నప్పుడు విడిపోయిన ప్రేమికులని తెలియదు. ఇప్పుడు కూడా అదే కథతో ఈ హలో సినిమా తెరకెక్కిందా అనే అనుమానం హలో సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

హలో సినిమా కూడా మనసంతా నువ్వెలానే ఉంది. .చిన్నప్పుడే హీరోహీరోయిన్లు విడిపోతారు. ఇద్దరికీ ఆధారం ఒక సెల్ ఫోన్ మాత్రమే. మధ్యలో ఇద్దరూ కలుసుకుంటారు కూడా. చివరికి క్లయిమాక్స్ లో కలుస్తారు. మనసంతా నువ్వే సినిమాలో పోయిన వాచ్ హీరోకు సింపుల్ గానే దొరుకుతుంది. హలోలో మాత్రం పోయిన సెల్ ఫోన్ కోసం ఫైట్స్ చేస్తాడు హీరో. అంతే తేడా… మిగతాదంతా సేమ్ టు సేమ్.

Similar News