అక్కినేని అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న 'హలో' సినిమా ఫిస్ట్ లుక్ కన్నా ముందే అఖిల్ లుక్ బయటికి వచ్చేసింది. అప్పుడు కాసేపు ఆ విషయం హాట్ టాపిక్ అయినా దాని తర్వాత నాగార్జున పెద్ద ఇష్యు.... కాకుండా ముగించేశాడు. ఆ లీక్ అయిన పిక్ ఏం చూస్తారులే... ఇదిగో ఒరిజినల్ పిక్ అంటూ హడావిడిగా అఖిల్ లుక్ ని అధికారికంగా పోస్ట్ చేసాడు. ఇక ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కలిగించి క్రేజ్ తీసుకురావాలంటే కొత్తగా ఏదన్నా చెయ్యాలనే ఆలోచనతో నాగార్జున టైటిల్ విడుదల చేసే ముందు సోషల్ మీడియాలో రకరకాల పబ్లిసిటీతో హోరెత్తించాడు. ఈ గేమ్ లో పడి జనాలు అఖిల్ మూవీ ఫస్ట్ లుక్ బయటకెలా వచ్చిందో అనే దాని మీద రచ్చ చెయ్యకుండా కామ్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఈ 'హలో' లుక్ బయటికెలా వచ్చిందో చెబుతున్నారు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ హాంకాంగ్ లో ఉండే తన ఫ్రెండుకు ఈ ‘హలో’ లుక్ ను డిజైనింగ్ కోసం పంపించాడట. విక్రమ్ ఫ్రెండ్ ఇదివరకే ‘మనం’ పోస్టర్లు కూడా డిజైన్ చేశాడట. అయితే ఆ డిజైనర్ ఈ హలో లుక్ రెడీ చేసి తన గర్ల్ ఫ్రెండుకు ఈ స్టిల్ షేర్ చేయడంతో.... ఆ అమ్మాయి తెలియకుండా సోషల్ మీడియాలో పెట్టేసిందట. అలా అఖిల్ రెండో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చేసిందని.... అంతే తప్ప అందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆ సినిమా నిర్మాత నాగార్జున స్పష్టం చేసాడు.
ఇక అఖిల్ రెండో సినిమాకి టైటిల్ పెట్టింది తానేనని... ఈ టైటిల్ గురించి చిత్ర యూనిట్ మొత్తం ఆరు నెలలుగా తీవ్ర ఆలోచనలో ఉన్నామని... అయితే ఒక రోజు నేను వ్యాయామం చేస్తున్న సమయంలో... ఈ 'హలో' టైటిల్ తట్టిందని చెప్పుకొచ్చాడు. అసలు మాములుగా నాకు ఉదయం పూట ఫ్రెష్ గా ఉండడం వలన మంచి మంచి ఆలోచనలు వస్తాయని.. ఆ ఆలోచనల నుండే ఈ 'హలో' అనే టైటిల్ పుట్టిందని చెప్పుకొచ్చాడు