అతనికి నాకు మధ్య అలాంటిదేం లేదు!

Update: 2018-02-20 04:59 GMT

ఇండస్ట్రీలో ఎలాంటి హీరోయిన్ అయినా తన కో స్టార్ తోనో లేకుంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తోనో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందంటూ అనేక రకాల గాసిప్స్ బయటికి వస్తూనే ఉంటాయి.. అందులో 99 శాతం గాసిప్ ఉంటె... కేవలం ఒక్క శాతం మాత్రమే నిజముంటుంది. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీలోని ప్రతిఒక్క హీరో, హీరోయిన్స్ ఎదుర్కొంటూనే ఉంటారు. ఎంతగా గాసిప్స్ కి దూరంగా వుందామనుకున్నా అది కుదిరే పని కాదు. అయితే ఇలాంటి పుకార్లనే తొలిప్రేమతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాశి ఖన్నా కూడా అనుభవించింది.

రాశి ఖన్నా కి దర్శకుడు అనిల్ రావిపూడి కి ముడిపెడుతూ టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో అనేక రకాల వార్తలు హల్చల్ చేశాయి. అందులోను కేవలం సుప్రీం సినిమాలో హీరోయిన్ గా చెయ్యడమే కాకుండా అనిల్ రావిపూడి - రవితేజ ల కలయికలో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రంలోనూ ఒక ఐటెం సాంగ్ చెయ్యడంతో ఈ పుకార్లు మాత్రం సోషల్ మీడియాలో అలుముకున్నాయి. ఒక హీరోయిన్ ఉన్నట్టుండి దర్శకుడి మీద అభిమానంతో ఐటెం సాంగ్ లో నర్తించడానికి ఒప్పుకుంది అంటే మరి ఇలాంటి పుకార్లే బయటికి వస్తాయి. కానీ అప్పట్లో రాశి ఖన్నా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టలేదు కానీ... తాజాగా తొలిప్రేమ సక్సెస్ తో ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన పుకార్లకు క్లారిటీ ఇచ్చేసింది.

దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మంచి స్నేహితుడని.... సుప్రీం సినిమాలో తనకు బెల్లం శ్రీదేవి లాంటి ఒక మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చెయ్యడం వలన... అలాగే బెంగాల్ టైగర్ సమయంలో రవితేజ నేను బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతోనే రాజా ది గ్రేట్ లో స్పెషల్ సాంగ్ చేశానని.. అంతేగాని నాకు అనిల్ కి మధ్యన ఏం లేదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో తెలియదు గాని... తాను కూడా ఒక తల్లికి బిడ్డనే అని.. అందరిలాంటి మామూలు అమ్మాయినే అని.. ఇలాంటి వార్తలు చదివినపుడు బాధపడతానని చెప్పడమే కాదు.... తాను ఇప్పటిదాకా ఎవరినీ ప్రేమించలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

Similar News