పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ 25 వ చిత్రం అనే ప్రత్యేకత అందరికి రిజిస్టర్ అయ్యేలా అజ్ఞ్యాతవాసి చిత్ర బృందం ఫస్ట్ లుక్ విడుదలకి కూడా టైటిల్ ప్రకటించాక పి ఎస్ పి కే 25 అంటూ వచ్చి సందడి చేశారు. సినిమా విజయం సాధించి ఉంటే కెరీర్ ప్రత్యేకమైన 25 వ చిత్రం పరిస్థితి ఎలా ఉండేదో కానీ డిసాస్టర్ కావటంతో సినిమా టైటిల్ కూడా సినిమా పై కామెంట్స్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో హీరో, డైరెక్టర్ అజ్ఞ్యాతం లోకి డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సిభిటర్స్ పాతాళం లోకి అని ఛలోక్తి విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్ ఆఖరి చిత్రం ఇదే అనే వార్త కూడా బాగానే సంచరిస్తుంది. మరి కళ్యాణ్ మరో చిత్రం చేస్తాడా లేదా పక్కనపెడితే, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా "అజ్ఞ్యాతవాసి తన తదుపరి ప్రజా సమావేశానికి ఎప్పుడు వస్తున్నాడు? జస్ట్ ఆస్కింగ్." అంటూ ట్వీట్ చేసి తన ట్వీట్ కి తానే రిప్లై రూపం లో చెయ్యాలనుకున్న కామెంట్ చేసాడు వర్మ. "తన అభిమానుల సమాచారం ప్రకారం అతను ఈ సారి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయటానికి వస్తున్నాడు." అంటూ కామెంట్ చేసిన వర్మ తన ట్వీట్ మరియు కామెంట్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించకుండా ఉండటం గమనార్హం.