అజ్ఞ్యాతవాసి దుస్తుల ఖర్చు అంతా ?

Update: 2018-01-16 04:44 GMT

కమర్షియల్ సినిమాలకి మేకింగ్ కంటే హీరో-డైరెక్టర్ కాంబినేషన్ ని సెట్ చేయటానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్న నిర్మాతలు పరిశ్రమలో పెరిగిపోతున్న రోజులలో పూర్తి బడ్జెట్ లో సినిమా కోసం ఖర్చు చేసేది 20 శాతానికి మించకుండా మిగతా మొత్తం పారితోషికాల రూపంలో వెళ్ళిపోతున్న పరిస్థితులని చూస్తూనే ఉన్నాం. అందుకే నానాటికి హీరోలు మరియు డైరెక్టర్ల పారితోషికాలు పెరిగిపోవటం, తద్వారా సినిమా నిర్మాణ వ్యయం పరిమితులు దాటిపోవటం జరుగుతోంది తప్ప సినిమా సినిమాకి పెరుగుతున్న ఖర్చుకి తగిన నాణ్యత పెరగటం లేదు.

అయితే క్రేజీ హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ చేస్తే ఎలాంటి గొడవ ఉండదు. అలా కానీ పక్షంలో మాత్రం ఓవర్ బడ్జెట్, అధిక పారితోషికాల మాటలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు అజ్ఞ్యాతవాసి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హీరో పవన్ కళ్యాణ్ లు వారి కాంబినేషన్ కి వున్న క్రేజ్ ని కాష్ చేసుకుంటూ హై రెమ్యూనిరేషన్ పుచ్చుకున్నారట. ఆదిలా ఉండగా ఇప్పుడు వినిపిస్తున్న మరో వార్త అజ్ఞ్యాతవాసి చిత్రంలో హీరో కాస్ట్యూమ్స్ కి ఐన ఖర్చు గురించి. కేవలం పవన్ కళ్యాణ్ ధరించిన దుస్తులకి 90 లక్షల రూపాయలు ఖర్చు చేసారంట నిర్మాత సూర్యదేవర రాధా కృష్ణ. అంటే ఒక చిన్న బడ్జెట్ చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుండి గుమ్మడికాయ కొట్టే వరకు అయ్యే ఖర్చు అజ్ఞ్యాతవాసి చిత్రంలో కేవలం హీరో దుస్తులకి ఖర్చయ్యాయన్నమాట.

Similar News