పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్ది టాలీవుడ్ సినీ జనాల్లోను, పవన్‌కళ్యాణ్ అభిమానుల్లోను హైటెన్షన్ నెలకొంది. గత కొద్ది రోజులుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న పవన్ అభిమానులు అజ్ఞాతవాసితో తమకు ఈ యేడాది సంక్రాంతి పండగ అదిరిపోవడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు.
ఈ నెల 10న రిలీజ్ అవుతోన్న అజ్ఞాతవాసి న్యూఇయర్ తొలి రోజునే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సోమవారం సాయంత్రం అజ్ఞాతవాసి షో చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు U / A సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమా పక్కా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉందని కితాబు ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా త్రివిక్రమ్ అజ్ఞాతవాసిని తెరకెక్కించాడట. ఇక ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి ఆడియోతో పాటు, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజ్ అయిన పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వర్ రావ్’ పాట అభిమానుల్ని ఒక ఊపు ఊపేస్తోంది.
ఈ సినిమాతోనే ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నాడు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమాకు మంచి టాకే వచ్చింది. మరి అజ్ఞాతవాసి ఎలా అదరగొడతాడో 9వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలతోనే తేలిపోనుంది