'అజ్ఞాత‌వాసి' లో ఇద్ద‌రు ఊహించ‌ని సెల‌బ్రిటీలు

Update: 2018-01-02 07:00 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న అజ్ఞాత‌వాసి సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమ‌వారం న్యూ ఇయ‌ర్ రోజు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 9వ తేదీ రాత్రి నుంచే అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్లు స్టార్ట్ కానున్నాయి.

సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. మ‌రో రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా స్టార్ట్ కానున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట అయితే యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. చాలా త‌క్కువ టైంలోనే రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇక ఈ సినిమాలో ఇప్ప‌టికే సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ రోల్ చేస్తుండ‌గా మ‌రో సెల‌బ్రిటీ సైతం ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ సెల‌బ్రిటీ ఎవ‌రో కాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన అనిరుధ్‌. అనిరుధ్ గ‌తంలో కూడా తాను మ్యూజిక్ ఇచ్చిన కొన్ని త‌మిళ సినిమాల్లో తెర‌పై త‌ళుక్కుమ‌న్నాడు.

ఇప్పుడు తాను తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన తొలి సినిమాలోనే గెస్ట్ రోల్ చేస్తూ తెర‌పై త‌ళుక్కుమ‌న్నాడు. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ నెల 5న రిలీజ్ చేయ‌నున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిన‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు.

Similar News