అజ్ఞాతవాసి సినిమా ట్రైలర్ గురించి నిన్న శనివారం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపాటు.. సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. ఉదయం నుండి రాత్రి వరకు అజ్ఞాతవాసి ట్రైలర్ గురించిన టాపిక్ ఇండస్ట్రీలో నడిచింది అంటే ఆ ట్రైలర్ కోసం అందరూ ఎంతగా ఎదురు చూసారో అర్ధమవుతుంది. అయితే ఉన్నట్టుండి సాయంత్రం ఐదు ఆ ప్రాంతంలో ఆజ్ఞతవాసి ట్రైలర్ టుడే అంటూ టైం సస్పెన్సు లో పెట్టి ఒక పోస్టర్ విడుదల చేసింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఇక మళ్ళీ ఏ టైం కి ట్రైలర్ ని విడుదల చేస్తారో తెలియక ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలు పెట్టారు. అయితే అజ్ఞాతవాసి టీమ్ మాత్రం శనివారం రాత్రి 12 గంటలకు అజ్ఞాతవాసి ట్రైలర్ ని యూట్యూబ్ లో వదిలింది.
అయితే టీజర్ కే ఎక్స్ టెన్షన్ లా ఉన్న ట్రైలర్లో కథ ఏ మాత్రం ఊహకు అందకుండా చాలా జాగ్రత్త పడ్డారు అజ్ఞాతవాసి దర్శకనిర్మాతలు. పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంగా ఒక కుర్చీ ని తయారు చేసే విధానం గురించి వర్ణిస్తూ... మినీ యుద్ధమే అంటూ పవన్ చెప్పిన డైలాగ్.... పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని, స్టైలింగ్ ని, యాక్షన్ సన్నివేశాలని, ఖుష్బూ పాత్రని, పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ తో అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ అన్నిటిని రివీల్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ లో అసలు కథ ఏమిటనేది మాత్రం ఒక్కటంటే ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. ఇక మరో హీరో ఆది పినిశెట్టి మాత్రం చాలా మోడరన్ లుక్ లో.. స్టైలిష్ గా కనిపించి వాయిలెన్స్n ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ అంటూ చెప్పే డైలాగ్ బావుంది.
ఇక పవన్ కళ్యాణ్ తాను పనిచేసే కంపెనీలో కామెడీగా చేసే రచ్చ మాత్రం ఈసినిమాకి స్పెషల్ హైలెట్ గా ఉండేలా కనబడుతుంది. ఎందుకంటే పవన్ ఆఫీస్ లో సైకిల్ వేసుకుని తిరగడం... మురళి శర్మ, రావు రమేష్ లు పవన్ కళ్యాణ్ గురించి భయపడడం... మురళి శర్మ భయపడుతూ మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా శర్మ అంటే.. దానికి రావు రమేష్ అతడేం ఎక్కినా పర్లేదు మనని ఎక్కకుండా ఉంటె చాలు అనే చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ని ఎండ్ చేశారు. మరి ఈ ట్రైలర్ లో దర్శకుడు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఆయన స్టయిల్ అంతా కొట్టచ్చినట్టుగా.. అనిరుద్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయ్యే విషయంగా ఉన్నాయి. మరి ఈ సంక్రాంతికి అజ్ఞాతవాసి సినిమాకి మాత్రం సూపర్ ఓపెనింగ్స్ పడేలా కనబడడమే కాదు... ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మిగతా సినిమాలను పవన్ అజ్ఞాతవాసి తొక్కేయడం ఖాయంగా కనబడుతుంది.