అజ్ఞాతవాసి సైడ్ ఎఫెక్ట్స్

Update: 2018-02-07 10:00 GMT

నితిన్ కి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో లై తో నితిన్ తో జోడికట్టిన మేఘ ఆకాష్ మరోమారు నితిన్ సరసన నటిస్తుంది. తనకు గురువు లాంటి పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటించడం అంటే నితిన్ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఖరారు చెయ్యలేదు గాని సినిమా విడుదల తేదీని మాత్రం అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఈ సినిమా ని ఏప్రిల్ 5 న విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం నిర్మాతగా మత్రమే కాకుండా ఈ సినిమాకి కథని కూడా త్రివిక్రమ్ అందించాడట. మరి అజ్ఞాతవాసి సినిమా డైరెక్షన్ లోనే కాదు కథ విషయంలోనూ అట్టర్ ప్లాప్ అయ్యింది. అసలు అజ్ఞాతవాసి కథ విషయంలో త్రివిక్రమ్ నిర్లక్ష్యాన్ని అందరు ఎండేశారు. ఇలాంటి సమయంలో నితిన్ కి త్రివిక్రమ్ అందించిన కథ విషయంలో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడూ ఓటమి చవి చూడని త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తో మొదటిసారి భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు.

ఇక నితిన్ - మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆసాంతం రొమాంటిక్ డ్రామాగా కొనసాగుతుందనేది తాజా సమాచారం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. మరి అజ్ఞాతవాసి ఎఫెక్ట్ ఇలా తన తదుపరి చిత్రం పై పడడం మాత్రం త్రివిక్రమ్ జీర్ణించుకోలేకపోతున్నాడట. ఇక నితిన్ సినిమా టైటిల్ ని ఈ నెల 12 న ఖరారు చేస్తారట.

Similar News