అజ్ఞాతవాసి కి మరోసారి చుక్కెదురైంది

Update: 2018-01-19 09:41 GMT

అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ అయ్యి దానిని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కింద మీద పడుతుంటే..లార్గోవించ్ దర్శకుడు మాత్రం ఈ సినిమాని వదిలేలాలేడు. అజ్ఞాతవాసి పై లార్గోవించ్ దర్శకుడు ముందు నుంచి ఓ కన్నేసి ఉంచాడు. ఈ సినిమా చాలా దగ్గరగా ఉందని.. టీ సిరీస్ తో సెటిల్మెంట్ చాలదేమో అంటూ ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు.

అయితే మరోసారి లార్గోవించ్ దర్శకుడు అజ్ఞాతవాసి సినిమాపై మరో బాంబు పేల్చాడు. 'కాపీ చేయకుండానే క్రియేటివిటీ చూపించగల ట్యాలెంట్ ఇండియన్ సినిమాకు ఉంది. వారం రోజులుగా అజ్ఞాతవాసి టీం సైలెంట్ గా ఉండడం విసిగిస్తోంది. అందుకే లీగల్ నోటీస్ రూపంలో యాక్షన్ తీసుకునేందుకు రెడీ' అంటూ ట్వీట్ చేసాడు.

అజ్ఞాతవాసి టీం నుండి అంతో ఇంతో పిండుకోవాలని ఈ దర్శకుడు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేకర్స్ వెళ్లి టీ సిరీస్ తో కాస్ట్ లీ సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇండియాలో లార్గోవించ్ రీమేక్ రైట్స్ ఈ సంస్థ దక్కించుకుంది కాబట్టి. అయితే.. ఈ సినిమాని ఇండియాలో మాత్రమే రిలీజ్ చేయలేదు కాబట్టి.. యాక్షన్ తీసేసుకోవచ్చు అనుకోవడం లార్గోవించ్ దర్శకుడి అత్యాశే కావచ్చు. అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా.. అది పక్కా తెలుగు సినిమానే. అయినా.. ఈయన తీసింది ఫ్రెంచ్ మూవీ. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Similar News