పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ని ఎట్టకేలకు ఈ రోజు ట్విట్టర్ ద్వారా ప్రకిటించింది చిత్ర బృందం. ఎప్పటినుండో ప్రచారం లో ఉన్న టైటిల్ 'అజ్ఞాతవాసి' నే ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. 'అజ్ఞాతవాసి' టైటిల్ ని దృష్టిలో ఉంచుకుని 'అజ్ఞాతవాసి' కథ ఇదే అంటూ ఆ మధ్యన ఒక స్టోరీ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో గడుపుతూ తన సవతి తల్లి పగని పంచుకుని... ఆ పగ సాధించే యువకుని పాత్రలో నటించాడని... అలాగే అజ్ఞాతం నుండి పవన్ బయటికి వచ్చేటప్పుడు రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ 'భాష' లెవల్లో అదిరిపోయే సీన్ ఉంటుందని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మాత్రం మరోలా ప్రచారం స్టార్ట్ అయ్యింది. అదేమిటంటే.. ఇపుడు 'అజ్ఞాతవాసి' లో పవన్ కళ్యాణ్ లుక్ ని చూసి.. చేతిలో ఐడి కార్డుని చూసిన వారు 'అజ్ఞాతవాసి' స్టోరీ లైన్ ఇదేనంటూ ప్రచారం మొదలెట్టారు. ఏమిటంటే 'అజ్ఞాతవాసి' లో పవన్ కళ్యాణ్ టెక్కీ రోల్ చేస్తున్నాడని... అలాగే 'అజ్ఞాతవాసి' టైటిల్ కిందున్న 'ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్' అనే ట్యాగ్ లైన్ నుంచి 'దేశబహిష్కారానికి గురైన రాకుమారుడు' అనే అర్థాన్నికూడా వెతికేస్తున్నారు కొందరు. అంతేకాకుండా విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ.. అక్కడి ఎన్నారై యువకుల సమస్యల కోసం పోరాడే కథను 'అజ్ఞాతవాసి' కథగా ప్రచారం జరుగుతుంది.
మరి సినిమా జనవరి 10 న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టేసారు. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ తోప్రభంజనం సృష్టించిన చిత్ర బృందం మరో 10 , 15 రోజుల్లో 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతుంది.