కత్తి మహేష్.. ఆరు నెలలు క్రితం అతనెవరో ఎవరికి తెలీదు తన ఫేస్బుక్ లో ఫాలోయర్స్ కి తప్ప. అలాంటిది ఉన్నట్టుండి ఒక్కేసారి టీవీ చానెల్స్ లో రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి పరిచయం అయిపోయాడు. అంతకుముందు తాను తీసిన పెసరట్టు అనే క్రౌడ్ ఫండెడ్ సినిమాకి దర్శకుడిగా మాత్రమే వారికి పరిచయం తప్ప ఇంకేరకంగానూ పబ్లిక్ కు అతని గురించి అవాగాహన లేదు.
అలానే మా టీవీ లో వచ్చిన బిగ్ బాస్ షో కత్తి మహేష్ అంటే ఎవరో తెలియజెప్పితే పవన్ ఫ్యాన్స్ తో వచ్చిన వివాదం ఆయన పాపులారిటీని అమాంతం పెంచేసింది. మధ్యలో ఎగసే తారాజువ్వలు అనే సినిమా చేసాడు కాని అది వచ్చిన విషయం కూడా ఎవరికి పెద్దగా తెలియదు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో పూనం కౌర్ కు ప్రశ్నలు సంధించడం, పవన్ కళ్యాణ్ తనను సమాధానం చెప్పాలి అని సవాల్ విసరడం వివాదాన్ని బాగా పెంచి పెద్ద చేసాయి.
ఇలా కత్తి మహేష్ చేయడం వెనుక ఏదన్నా రాజకీయ పార్టీ ఉందని అనుమానాలు కూడా వచ్చాయి. అయితే మహేష్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఏ రాజకీయ పార్టీ లేదు. తమ టిఆర్పి రేటింగ్స్ కోసం కొన్ని న్యూస్ ఛానల్స్ అతన్ని వాడుకుంటున్నాయి అనే వాదనలో కూడా నిజం లేకపోలేదు. అవసరానికి మించి ఈ ఇష్యూ మీద అవి పబ్లిసిటీ చేయడం.. ప్రైమ్ టైం లో డిబేట్ లు పెట్టి రచ్చ చేయటం పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసమే అనే కామెంట్ కూడా బలంగా వినిపిస్తోంది.
అజ్ఞాతవాసి ఆడియో టెలికాస్ట్ హక్కులు తమకు రాలేదు అన్న అక్కసుతోనే ఒక ఛానల్ ఇలా విపరీతంగా ఫోకస్ చేస్తోంది అనే మాట కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ రానంతమాత్రాన మరి ఇలా దిగజారాలా అని ఆ ఛానల్ పై మండిపడుతున్నారు.