అజ్ఞాతవాసి అమ్మాయిలతో డాన్స్ చేస్తాడంట

Update: 2017-10-20 08:32 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అనే ప్రచారం జరుగుతుంది. కానీ అధికారికారిక ప్రకటన మాత్రం చిత్ర బృందం ఇవ్వడంలేదు. అలాగే ఈ దీపావళి కానుకగా పవన్ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేస్తారనే టాక్ ఉన్నప్పటికీ అది జరగలేదు. కాకపోతే ఈ విషయంలో పవన్ ఫాన్స్ కాస్త ఫీల్ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం చిక్ మంగుళూరు పరిసరప్రాంతాల్లో చిన్న పాటి షెడ్యూల్ ని ప్రారంభించి.. దాదాపు మూడు రోజుల పాటు షూటింగ్ జరిపి.. ఆషెడ్యుల్ ని తాజాగా ముగించింది.

ఇక కొద్దిగా విరామం తర్వాత చిత్ర బృందం 15 రోజుల పాటు ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ 15 రోజుల ఫారిన్ షడ్యూల్ లో పవన్ కళ్యాణ్, హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ ల మీద పాటల చిత్రీకరణ జరగనున్నట్టుగా చెబుతున్నారు. మరి యూరోప్ లో పవన్ కళ్యాణ్ ఇద్దరు కొత్త భామలైన అను, కీర్తి లతో ఆడిపాడనున్నాడు. ఇకపొతే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10 న విడుదల చేస్తున్నారు.

ఖుష్బూ, ఇంద్రజ, అది పినిశెట్టి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటే శాటిలైట్ హక్కులకు భారీ ధర పలుకుతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Similar News