అఖిల్ రెండో సినిమా షూటింగ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటివరకు అఖిల్ సినిమాకి టైటిల్ గాని, హీరోయిన్ ని గాని బయటకి చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్న చిత్ర టీమ్, అఖిల్ కి సంబందించిన ఒక విషయాన్నీ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు కానుకగా బయటికి వదులుతారనే ప్రచారం మొదలైంది. నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న అఖిల్ చిత్రానికి ఇప్పటివరకు 'జున్ను, ఎక్కడ ఎక్కడ ఉందో తారక, రంగుల రాట్నం' వంటి టైటిల్స్ పెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ 'జున్ను, ఎక్కడ ఎక్కడ ఉందో తారక, రంగుల రాట్నం' టైటిల్స్ రిజిస్టర్ చేయించేసరికి అఖిల్ సినిమాకి ఇందులో ఎదో ఒక టైటిల్ ఫిక్స్ చేస్తారని అక్కినేని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.
అయితే అఖిల్ చిత్రాన్ని డిసెంబర్ 22 న విడుదల తేదీ ప్రకటించిన నాగార్జున... తనకి అచ్చొచ్చిన డిసెంబర్ లోనే కొడుకు సినిమా కూడా విడుదలైతే సక్సెస్ సాధిస్తుందనే ఆశతో అలా డిసెంబర్ లో విడుదల డేట్ ఫిక్స్ చేసాడంటున్నారు. ఇకపోతే అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ గాని, ఆ సినిమా టైటిల్ ని గాని ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే సందర్బంగా విడుదల చేస్తారని చెబుతున్నారు. మరి విక్రమ్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఈ సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుంది కాబట్టే నాగార్జున అఖిల్ రెండో సినిమా బాధ్యతలు విక్రమ్ కి అపపజెప్పాడనే టాక్ అయితే ఉంది.
మరి మొదటి సినిమా డిజాస్టర్ తో అతలాకుతలం అయిన అఖిల్ ఇప్పుడు రెండో సినిమాతోనైనా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.