ఒకప్పుడు అన్ని భాషల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి ఇప్పటికి సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది. కూతుళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నా కూడా శ్రీదేవి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్లు తల్లిని మించే అందగత్తెలు కాకున్నా... వాళ్ళ అందం వాళ్లకి ఉంది. హీరోయిన్స్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో సరిగ్గా క్లారిటీ లేదుగాని శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు మాత్రం ఒకరినిమించి మరొకరు చెలరేగిపోతున్నారు. మొన్నటివరకు జాన్వీ కపూర్ మాత్రమే సినీ అరంగేట్రం అనుకున్నారు... కానీ అనూహ్యంగా ఖుషి కపూర్ కూడా లైన్ లోకొచ్చేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇకపోతే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా అక్కతో సమానంగా పార్టీలకు, ఫంక్షన్స్ కి అటెండ్ అవడమే కాదు... అక్కకి గట్టి పోటీ ఇచ్చేలాగే కనబడుతుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాల విందు చేస్తుంది. తాజాగా జాన్వీ, ఖుషి కపూర్స్ ఇద్దరు ముంబై లోని ఓ రెస్టారెంట్ కి వచ్చారని సమాచారం తెలియడంతో ఫోటో గ్రాఫర్లు అక్కడికి చేరుకొని వారి కెమెరాలకు పని చెప్పారు. అక్కడ రెస్టారెంట్ లో జాన్వీ, ఆమె సోదరి ఖుషి కపూర్ ల వేషధారణ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంది. ముఖ్యంగా ఖుషి కపూర్ డ్రెస్ అయితే స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. త్వరలోనే జాన్వీ కపూర్ సినీ అరంగేట్రం... వెనువెంటనే ఖుషి కపూర్ కూడా ఎంట్రీ అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
మరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ విషయంలోనే ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇక చిన్న కూతురు ఖుషి కపూర్ విషయంలో ఇంకెంతగా ఆలోచిస్తుందో కదా అంటున్నారు.