జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెరకెక్కుతున్న బిగ్ బాస్ షో గురించి ఇప్పటివరకు పోసిటివ్ ప్రచారం జరగడమే కాక షోకి విపరీతమైన క్రేజ్ వచ్ఛేసింది. అయితే ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ టీమ్ తో పాటే జూనియర్‌కి ఒక టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్ ఏమిటో మీరే చూడండి. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ షో కోసం భారీ పారితోషికంతో పాటు తన కండీషన్స్ ప్రకారం సెట్స్, సాంకేతికనిపుణులను ఎంచుకుని తమన్ చేత మ్యూజిక్‌ని చేయించుకుని థీమ్‌సాంగ్ కూడా చేయించుకున్నాడు.
ఇక హిందీలో హిట్టయిన ఈ షో తెలుగులో ఏమాత్రం వర్కౌట్ అవుతుందనే దానిపై పలు అనుమానాలున్నాయి. ఎన్టీఆర్‌కి మంచి వాయిస్, సమయ స్ఫూర్తి, కలుపుకుదోలుతనం ఉన్నా ఉత్తరాది వారికి దక్షిణాది వారికి ఎన్నో విషయాలలో బేధాలున్నాయి. తినే తిండి నుంచి శరీరాకృతివరకు చాలా తేడాలున్నాయి. ఉత్తరాది వారు మాట్లాడినంత బోల్డ్‌గాదక్షిణాది వారు మాట్లాడలేరు. మన జబర్దస్త్, పటాస్‌లపైనే బూతు అని అంటున్నాం, మరి కాఫీ విత్ కరణ్‌లో ఆయన అడిగే ప్రశ్నలు, వాటికి ఆయా సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలను మనం కనీసం ఊహించనుకూడా లేం. ఇక ఉత్తరాది వారు దక్షిణాదిలో ఎందుకు రాణిస్తున్నారు? మన తెలుగమ్మాయిలు తెలుగులో ఎందుకు రాణించలేకపోతున్నారు అంటే వారు దారాళంగా చేసే గ్లామర్‌షోని మన అమ్మాయిలు, సంప్రదాయం నిండిన వారు చేయలేరు. ఎవరైనా ఉత్తరాది వారు చేస్తే చూస్తారు.. కానీ ఆ విషయం పదిమందిలో చెప్పుకోవడానికే సిగ్గుపడాతారు.
ఇక హిందీ అనేది ఉర్దూ, అరబ్బీ వంటి వాటిని పోలివుంటుంది.దీంతో పాకిస్థాన్, సౌదీ వంటి దేశాలలో కూడా హిందీకి విస్తృతమార్కెట్‌ఉంది. కానీ దక్షిణాది పరిస్థితి అలాంటిది కాదు.ఇక తాజాగా తమిళంలో విజయ్ టీవీలో కమల్‌హాసన్‌హోస్ట్ చేస్తున్న 'బిగ్‌బాస్'మొదలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జల్లికట్టులో పాల్గొన అమ్మాయిని తెచ్చి సెలబ్రిటీని చేయడం, ఫేడవుట్ అయిన నమిత తప్ప చెప్పుకోదగ్గ సెలబ్రిటీలు రాకపోవడంతో దీనిపై ఫ్లాప్‌టాక్ వస్తోంది. దీంతో మరి స్టార్ మా, ఎన్టీఆర్‌లకు టెన్షన్ మొదలైందంటున్నారు.