అంధుడిగా.... అదరగొట్టేస్తున్నాడు

Update: 2017-08-15 07:57 GMT

రవితేజ. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'రాజా ది గ్రేట్' టీజర్ ని 71 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకంక్షలతో విడుదల చేశారు. మాస్ మహారాజ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. 25 ఏళ్లుగా అంధుడిగానే కనబడనున్న ఈ చిత్రంలో రవితేజ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ లెవల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అని ఒక వాయిస్ ఓవర్ వినపడగానే వెంటనే రవితేజ నోర్ముయ్ ఆ నయనాలు లేకుండా పాతికేళ్ళు నుండి కుమ్మేత్నానిక్కడ.... సర్వేంద్రియానం సర్వం ప్రధానం ఇక్కడ అంటూ రవితేక మార్క్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా... సినిమాపై అంచనాలు పెంచేలా వుంది.

ఇక కళ్ళు లేకపోయినా తెలివితేటలతో ఈ ప్రపంచంలో జీవించడం చాలా తేలిక అని చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు.... కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలంటూ రవితేజ తల్లి పాత్రలో కనబడనున్న రాధికా చెప్పే తీరు.... ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రో కబడ్డీ మ్యానియాతో పడి కొట్టుకుపోతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఈ సినిమాలో రవితేజని కబడ్డీ ప్లేయర్ గా చూపించడం వంటి కొత్త అంశాలతో 'రాజా ద గ్రేట్' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ ని సంపత్ ని పోలీస్ లుగా చూపించి.... హీరోయిన్ మెహరీన్ ని మాత్రం ఆవేశంగా ట్రైన్ పక్కనే పరిగెడుతున్న స్టయిల్లో పరిచయం చేసాడు. 'ఐ యామ్‌ బ్లైండ్‌.. బట్‌ ఐ యామ్‌ ట్రైన్డ్‌' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తుంటే రవితేజతో ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంది.

రవితేజ మోహంలో కాస్త గ్లో తగ్గినా కూడా అతని ఎనర్జీతో దాన్ని కప్పెట్టేసాడు. మరి ఈ టీజర్ చూస్తుంటే మాత్రం రవితేజ ఎక్కువ గ్యాప్ తీసుకుని అంధుడిగా కొత్తగా ఒక ప్రయోగం చేసినప్పటికీ మంచి కథతో ఆకట్టుకుని హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు.

Similar News