అఖిల్ తన రెండో సినిమాని ఈ ఏడాది మొదట్లోనే విక్రమ్ కుమార్ డైరెక్షలో స్టార్ట్ చేసి చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసేసాడు. సినిమా మొదలై ఇన్నిరోజులవుతున్నప్పటికీ అఖిల్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. మొదట్లో బాలీవుడ్ భామ అలియా భట్ ని అఖిల్ కి జోడిగా అనుకున్నారు. కాదు కాదు అంటూ మేఘా ఆకాష్ ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ ఎవరిని ఫైనల్ చెయ్యలేదు చిత్ర యూనిట్.
అయితే ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా అఖిల్ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపడంలేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలా హీరోయిన్స్ అఖిల్ సినిమాలో చేయకపోవడానికి కారణం ఏమిటంటే అఖిల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండడమేనట. ఇక సినిమా మొత్తం హీరో పాత్ర.... హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటుందట. దాదాపు సినిమా చివరివరకు హీరోయిన్ డైరెక్ట్‌గా స్ర్కీన్ మీద కనబడదట.
అలాగే సినిమాలో కేవలం పాటల్లో తప్ప కథలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధన్యం లేకపోవడం వల్లే చాలామంది హీరోయిన్లు అఖిల్ మూవీని రిజెక్ట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు గాని షూటింగ్ మొదలు పెట్టి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా హీరోయిన్ ని సెట్ చెయ్యకపోవడమనేది కాస్త విచిత్రంగానే వుంది.