అల్లు అర్జున్ 'డీజే' తర్వాత వక్కంతం వంశీని దర్శకునిగా సినిమా రంగానికి పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య' చిత్రాన్నిచేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనబడనున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆ లుక్ ని ఇంతవరకు విడుదల చెయ్యలేదు.. అసలా ఊసే ఎత్తడంలేదు. అయితే అప్పుడు ఆగష్టు 15 న ఫస్ట్ లుక్ ఇచ్చేస్తే గనక మరి ముందుగానే సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చేసినట్టు అవుతుందని డ్రాప్ అయ్యారట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ కోసం అమెరికా ట్రైనర్ వచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి.
ఇక ఈ చిత్రానికి సంబందించిన వివరాలేమీ బయటికి పొక్కకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం 'నా పేరు సూర్య' సెట్స్ లో కొత్తగా జాయిన్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్, అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' లుక్ గురించి చాలా గొప్పగా చెప్పేస్తున్నాడు. మరి అంత గొప్పగా చెప్పిన అల్లు అర్జున్ న్యూ లుక్ ని చూడడానికి అల్లు అభిమానాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందులోను వెన్నెల కిషోర్ అంత గొప్పగా చెబుతున్నాడు అంటే నిజంగానే ఆలు అర్జున్ లుక్ అంత బావుందా అనే ఆరాటంలో కొట్టుమిట్టాడుతున్నారు అభిమానులు.
మరి దర్శకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమవుతున్న వక్కంతం, అల్లు అర్జున్ ని కొత్తగా స్టైలిష్ లుక్ లో చూపించడానికి తెగ తపన పడుతున్నాడట. అయితే అది ఎంత కొత్తగా ఉంటుందనేది మరికొంత కాలం వేచి చూస్తే తెలుస్తుంది అంటున్నారు. సినిమా సినిమాకి హెయిర్ స్టయిల్, డ్రస్సింగ్ పరంగా కొత్తదనం కోరుకునే అల్లు అర్జున్ మాములుగా అయితే తన కొత్త లుక్ ని పెద్దగా దాచిపెట్టుకోడు. వీలైనంత తొందరగా అభిమానుల ముందు పెట్టడానికే ప్రయత్నిస్తాడు. మరి ఈసారి బయటికి రాకుండా ఆపుతున్నాడు అంటే 'నా పేరు సూర్య' లుక్ ఎంత కొత్తగా వుండబోతుందో అనే క్యూరియాసిటీ కలుగుతుంది.