అందరూ టాప్ టెక్నీషియన్స్ అంట

Update: 2017-08-14 10:01 GMT

మహేష్ సూపర్ ఫాస్ట్ గా దూసుకొచ్చేస్తున్నాడు. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్నా 'స్పైడర్' తో ఆలస్యమైనా కూడా ఇప్పుడు తాను చెయ్యబోయే న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో మహేష్ చాలా తొందరపడుతున్నారు. 'స్పైడర్' షూటింగ్ కంప్లీట్ కాకుండానే కొరటాలతో న్యూ ప్రాజెక్ట్ 'భరత్ అను నేను' మూవీని స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళిన మహేష్ బాబు ఇప్పుడు వంశి పైడిపల్లి డైరెక్షన్ లో మరో మూవీని ఆఫీసియల్ గా పట్టాలెక్కించేసాడు. ఈరోజు సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిమంది సన్నిహితులు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వంశి పైడిపల్లి, మహేష్ వైఫ్ నమ్రత, పిల్లలు గౌతమ్, సితార, కె రాఘవేంద్ర, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారి చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇక ఎప్పటిలాగే ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మహేష్ దూరంగా వున్నాడు.

ఇక ఈ కార్యక్రమంలో మహేష్ భార్య పిల్లలు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. దిల్ రాజు, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచెయ్యనున్నారని చెబుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా... ‘ధృవ, ఊపిరి, విక్రమ్ వేద’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన పిఎస్. వినోద్ కెమెరా వర్క్ చేయనున్నారని సమాచారం అందుతుంది. అయితే ఈచిత్రానికి సంబందించిన నటీనటులు, హీరోయిన్ విషయం ఫైనల్ కావాల్సి ఉంది.

అలాగే మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' వచ్చేనెల 27 న దసరా కానుకగా విడుదల కానుంది. అలాగే కొరటాలతో మహేష్ చేస్తున్న 'భరత్ అను నేను' చిత్రం వచ్చే ఏడాది సంక్రాతి బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

Similar News