అందరూ ఆమె వెంటే పడుతున్నారు

Update: 2017-09-25 08:32 GMT

టాలీవుడ్ లో ఒక్క పవన్ తో తప్ప మిగతా టాప్ హీరోలందరితో జోడి కట్టి టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఇప్పుడు బెస్ట్ ఛాయస్ ఎవరు అంటే వెంటనే రకుల్ అని చెప్పేసే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ హీరోలంతా నయనతార వెంటపడుతుంటే యంగ్ హీరోలంతా రకుల్ వెంట పడుతున్నారు. ఇక రకుల్ ప్రీత్ తాజాగా నటించిన 'స్పైడర్' చిత్రం ఇటు తెలుగు అటు తమిళంలోనూ విడుదల కానుంది. ఇక ఇప్పటికే తెలుగులో గట్టిగా నిలదొక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ 'స్పైడర్' సినిమాతో తమిళంలోనూ హావా కొనసాగించడానికి రెడీ అయ్యింది.

మహేష్ బాబు తో మొదటిసారి రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ 'స్పైడర్' ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' చిత్రం గనక తమిళంలో హిట్ అయ్యిందా రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికే తమిళ హీరో కార్తీతో జతకట్టిన ‘ఖాకీ’ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘స్పైడర్’ ట్రైలర్ లో రకుల్‌ని చూసిన కోలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు తమ సినిమాల్లో రకుల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలని అంటున్నారనేది కోలీవుడ్ మీడియా చెబుతున్న మాట.

'స్పైడర్' విడుదల కాకముందే రకుల్ కి విశాల్ తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడట. అయితే రకుల్ ఈ అవకాశాన్ని వదులుకునేలాగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలతో విశాల్ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమని భావిస్తోందట. అయితే విశాల్ మాత్రం ఎలాగైనా డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని తన సినిమాలో నటించమని రిక్వెస్ట్ చేస్తున్నాడట. మరి విశాల్ అంతలా అడుగుతున్నాడు అంటే రకుల్ కి తమిళంలో వచ్చిన క్రేజ్ మనకు ఈజీగా అర్ధమవుతుంది. సో దీనిబట్టి తెలుగుతో పాటే తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా రకుల్ చక్రం తిప్పడానికి రెడీ అయ్యిందన్నమాట.

Similar News