పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితంలోను ఎంతో మధురమైన ఘట్టం. పెళ్లితో మరోఇంటి కోడలిగా అడుగుపెట్టి అక్కడి కుటుంబంలో కలవడానికి అమ్మాయి పడే కష్టాలు వేరే చెప్పక్కర్లేదు. కొంతమంది అమ్మాయిలు ఎంతో చాకచక్యంగా భర్త కుటుంబంతో కలిసిపోతే.. మరికొంతమంది ఆ కుటుంబంలో కలవడానికి కొంత సమయం తీసుకుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ జంట కొత్తగా వివాహం చేసుకుని సంచలనాలు నమోదు చేసింది. ఆ యువ ప్రేమ జంట ఎవరో కాదు నాగ చైతన్య - సమంతలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుని... ఈ అక్టోబర్ 6,7 తేదీల్లో హిందూ క్రిష్టియన్ సంప్రదాయాల్లో రెండుసార్లు సింపుల్ గా పెళ్లి చేసుకుని అందరిని అబ్బుర పరిచారు.
ఇప్పుడు రిసెప్షన్ ని హానీమూన్ ని పక్కనపెట్టి మరీ తమ సినిమాల మీద కాన్సంట్రేషన్ చేసింది ఈ జంట. సమంత పెళ్లి అవుతుందని తెలిసిన నిర్మాతలు ఆమెతో కమిట్ అయినా సినిమాల పరిస్థితి ఏమిటో అని మదన పడకుండా సమంత తన వర్క్ మీద ఫోకస్ చెయ్యడమే కాదు... పెళ్లి అయిన వారానికే సినిమాల సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. ముందుగా రాజుగారి గది 2 ప్రమోషన్స్ తో మామగారు నాగార్జునతో పాల్గొని.. అక్కినేని ఫ్యామిలీ బాధ్యతల్లో పాలుపంచుకుంటానని చెప్పిన సమంత ఇప్పుడు మహానటి షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
అలాగే శనివారం రాజాగారి గది సినిమా హిట్ తో ఛానల్స్ కి ఫోన్ ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చేసింది. అదికూడా అక్కినేని కుటుంబంలో నాగ చైతన్య తో కలిసి ఒక పూజ కోసం ప్రిపేర్ అవడంతో పాటుగా ఈ రాజుగారి గది 2 ఫోన్ ఇంటర్వ్యూ లు ఇచ్చింది అంటే సమంతని శెభాష్ అనకుండా ఉండలేము. మరి పెళ్లి చేసుకున్నా బద్దకించకుండా ఇలా ప్రొఫెషన్ మీద సమంత కాన్సంట్రేట్ చేయడాన్ని మాత్రం పలువురు అభినందిచేస్తూ ఈ అందమైన జంటని దీవించేస్తున్నారు.