ఇండస్ట్రీలోని కొంతమంది మీడియం రేంజ్ హీరోలకు తమ మార్కెట్ ఎంతో అనేది తమ తమ సినిమాల బట్టి ఈజీగానే అర్ధవుతుంది. ఒక్కోసారి మాత్రం కొన్ని కొన్ని డీల్స్ సెట్ అయ్యేంత వరకు అంత మార్కెట్ ఉందని వాళ్లకు కూడా తెలీదు. ఒక్కసారి డీల్ సెట్ అయిన తర్వాత ఆశ్చర్యపోవడం అనేది ఆ హీరో వంతు కాదు... ప్రేక్షకుల వంతు కూడా అవుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు అలాంటి ఆశ్చర్యాన్నే ప్రేక్షకులకు అందిస్తున్నారు. వాళ్లెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్, అల్లు శిరీష్.
ఇండస్ట్రీలో కల్యాణ్ రామ్ హీరోగా కేవలం రెండు మూడు హిట్ సినిమాలు మాత్రమే చేసాడు. ఈ హీరో ప్రస్తుతం జయంత్ దర్శకత్వంలో ఓ లవ్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా 4 కోట్ల 75 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. మరి కల్యాణ్ రామ్ సినిమా ఇంత మొత్తానికి శాటిలైట్ అమ్ముడుపోవడం ఇదే ఫస్ట్ టైం. మరి దీనినిబట్టి కళ్యాణ్ రామ్ సినిమాకి ఏం చూసి అంత భారీ డబ్బు వెచ్చించి ఆ ఛానల్ వారు సినిమా శాటిలైట్ హక్కులు కొన్నారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ రెండు సినిమాల్ని జెమినీ టీవీ కొనుగోలు చేసింది.
ఇక మరో మెగా హీరో అల్లు శిరీష్ మార్కెట్ వాల్యూ ఏంటనేది అందరికీ తెలిసిందే. ఏదో... కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు తర్వాత శిరీష్ మార్కెట్ కాస్త పెరిగింది. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న ఒక్క క్షణం అనే సినిమాకు శాటిలైట్ రైట్స్ కింద 2 కోట్ల రూపాయలు వచ్చాయి అంటే మాత్రం నమ్మబుద్దే కావడం లేదు. మరి అసలు సినిమా రిలీజ్ కు ముందే అల్లు శిరీష్ సినిమా అమ్ముడుపోవడం ఒక వండర్ అయితే..… ఏకంగా 2 కోట్లకు శాటిలైట్స్ హక్కులు అమ్ముడుపోవడం మరో ఎత్తు.
మరి ఈ ఇద్దరి హీరోల సినిమాలను అంత భారీ సొమ్ము ధారబోసి కొన్న ఛానల్ ఏదో కాదు.. జెమిని ఛానల్ వారే.