బోయపాటి శ్రీను - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జయ జానకి నాయక' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పబ్లిసిటీకి తెరలేపింది. మొన్నటికి మొన్న ఫస్ట్ లుక్ తో బోయపాటి మార్క్ ని పక్కనపెట్టి మంచి రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ లు లవ్ బర్డ్స్ లా కనబడ్డారు. అయితే మలి పోస్టర్ లో బోయపాటి మార్క్ మాస్ మసాలా లుక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ అదరగొట్టేసాడు. ఇక ఇప్పుడు 'జయ జానకి నాయక' టీజర్ తో ప్రేక్షకులని పలకరించడానికి వచ్చేసారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్ర టీజర్ చాలా సాఫ్ట్ గా రొమాంటిక్ గానే వుంది. కానీ మాస్ వాసన తగలకుండా టీజర్ ని కట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ స్టూడెంట్ గా సాఫ్ట్ లుక్ లో అదరగొడుతుంటే.... రకుల్ ప్రీత్ సింగ్ మరోమారో గ్లామర్ గర్ల్ గా దర్శనమిచ్చింది. ఇక తమిళ హీరో శరత్ కుమార్ ని కూడా టీజరో లో సాఫ్ట్ గానే పరిచయం చేసాడు దర్శకుడు. ఈ టీజర్ చూసిన ఎవరైనా బోయపాటి మార్క్ మిస్ అయ్యిందని.... 'జయ జానకి నాయక' సినిమా ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గానే వుంటుందనే ఊహకి వచ్చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబి తీసిన విజువల్ రిచ్నెస్ టీజర్ కి ప్లస్ పాయింట్ చెప్పొచ్చు.
ఇక 'జయ జానకి నాయక'లో రకుల్ ప్రీత్ హీరోయిన్ కాగా కేథరిన్ ఒక ఐటెం సాంగ్ లో నటిస్తుంది. మరి భారీ బడ్జెట్ చిత్రంగా చెబుతున్న ఈ చిత్రం అంతభారీగా బిజినెస్ చెయ్యాలి అంటే బోయపాటి మార్క్ మీదే అంతా ఆధారాపడి ఉంటుందంటున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ చిన్న హీరోనే కాబట్టి పెట్టిన పెట్టుబడి రావాలంటే బోయపాటే ఆధారం అంటున్నారు.