రానా బాహుబలిలో భళ్లాలదేవగా ఎంతగా మెప్పించాడో... అంతే కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు. ఇక బాహుబలిలో నటిస్తూనే 'ఘాజి' వంటి హిట్ మూవీలో నటించాడు. ఇక బాహుబలి పూర్తయ్యాక తేజ డైరెక్షన్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఆ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఇక ట్రైలర్ తోనే సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేసాడు డైరెక్టర్ తేజ. 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో రానా, జోగేంద్ర గా పొలిటికల్ పంచ్ లు పేలుస్తూ... మాంచి పంచె కట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అందులోను రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ లతో రొమాన్స్ కూడా ఈ సీనియాపై అంచనాలు పెరగటానికి కారణమయ్యింది.
అయితే ఈ చిత్రానికి నిర్మాతలు మరీభారీగా పెట్టకపోయినా దాదాపు 11 కోట్ల పెట్టుబడి పెట్టారు. అయితే డైరెక్టర్ తేజకి, హీరో రానాకీ ఈ చిత్రంలో పావలా వాటా ఇచ్చేట్లు నిర్మాతలు ముందే ఒప్పందం చేసుకునే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. ఇక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత సినిమాకి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అదే బజ్ తో ఈ సినిమాకి మంచి ప్రాఫిట్ వచ్చేసింది. రానా రెమ్యూనరేషన్, తేజ రెమ్యూనరేషన్ కాకుండా సినిమాకి 11 కోట్ల పెట్టుబడి పెట్టినప్పటికీ.... ఈ చిత్రానికి అన్ని ఖర్చులు పోను... 9 కోట్ల లాభం వచ్చినట్లు చెబుతున్నారు.
తెలుగు శాటిలైట్స్ హక్కులకు 3 కోట్లు రాగా, హిందీ శాటిలైట్స్ హక్కులకి 7కోట్లు వచ్చాయి. అలాగే తమిళ్ శాటిలైట్స్ కి 2 కోట్లు... మళయాలం శాటిలైట్స్ కి 1.5 కోట్లు వచ్చాయంటున్నారు. ఇక హిందీ ఇంటర్ నెట్ 2.5 కోట్లు రాగా..., తెలుగు ఇంటర్ నెట్ 2.5 కోట్లు వచ్చాయని.... మొత్తం కలిపితే 19.5 కోట్లు 'నేనే రాజు - నేనే మంత్రి'కి వచ్చాయని చేబుతున్నారు. మరి కేవలం థియేటర్స్ రైట్స్ ని అమ్మకుండా నే ఈ చిత్రం 9 కోట్ల లాభాలు జేబులో వేసుకుంది. అందుకే ఈచిత్రాన్ని వచ్చే ఆగష్టు 11 న ఫుల్ టఫ్ కాంపిటీషన్ లో కూడా విడుదల చెయ్యడానికే రానాగారి తండ్రి సురేష్ బాబు మొగ్గు చూపడం ఒకటైతే... ఇక ఈ చిత్రం థియేటర్స్ రైట్స్ అమ్మకుండా నాలుగు రాష్ట్రాల్లో సొంతంగా విడుదల చేసుకుందామని సురేష్ బాబు ఆలోచనగా చెబుతున్నారు.
ఎలాగూ 9 కోట్ల లాభం వచ్చేసింది. అందుకే సురేష్ బాబు ఎవ్వరి మాట వినకుండా సొంతంగానే 'నేనే రాజు - నేనే మంత్రి' విడుదల చెయ్యడానికి సిద్దమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి దీనికి 'నేనే రాజు - నేనే మంత్రి' నిర్మాతలు ఎలా ఫీల్ అయినా ఫైనల్ డెసిషన్ మాత్రం సురేష్ బాబుకే వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. .