అంతా పోసాని చుట్టూతానే తిరుగుతుందట!

Update: 2017-08-31 10:16 GMT

'స్పైడర్' కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న అభిమానులు మరో 20 రోజుల్లో పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ 'స్పై' గా కనిపించనున్నాడు. ఇక 'స్పైడర్' పాటల షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు 'స్పైడర్' పబ్లిసిటీ కి సంబందించిన కార్యక్రమాలను కూడా మొదలెట్టేయ్యాలనే ఆలోచనలో చిత్ర టీమ్ నిమగ్నమై ఉంది. ఇకపోతే 'స్పైడర్' చిత్రం ఇంకా విడుదల కాకముందే మహేష్ బాబు కొరటాల డైరెక్షన్ లో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు పొలిటీషియన్ గా కనబడబోతున్నాడు.

'స్పైడర్' చిత్రంలో ఎంతో స్టైలిష్ గా... టూ క్లాసీగా కనబడుతున్న మహేష్ 'భరత్ అనే నేను' లో మాత్రం 'స్పైడర్' లుక్ కి పూర్తి భిన్నంగా కనబడతాడట. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న 'భరత్ అనే నేను' లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అయితే 'భరత్ అనే నేను' లో పోసాని కృష్ణ మురళి క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ గా నిలవనుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో పోసానిది చాలా కీలకమైన పాత్ర అట. డైలాగ్ డెలివరీ అండ్ కామెడీతో ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టెయిన్ చేయనున్నాడనే టాక్ వినబడుతుంది.

ఈసారి కొరటాల శివ తన 'భరత్ అనే నేను' చిత్రంలో పోసాని కేరెక్టర్ ని బలంగా చూపించబోతున్నాడన్నమాట. 'మిర్చి'లో సత్యరాజ్ ని హైలెట్ చేసినట్టు, అలాగే 'శ్రీమంతుడు'లో రాజేంద్ర ప్రసాద్ ని హైలెట్ చేసినట్టు, ఇక 'జనత గ్యారేజ్' లో మోహన్ లాల్ పాత్రని హైలెట్ చేసినట్టే ఈ చిత్రంలో పోసాని ని హైలెట్ చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది అంటున్నారు. ఇక ఈ పాత్రని పోసాని అదరగొట్టెయ్యడం ఖాయమంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాలీవుడ్ భామ కైరా అద్వానీతో రొమాన్స్ చేస్తున్నాడు.

Similar News