అంతా నాన్నే

Update: 2018-02-05 09:16 GMT

హీరోయిన్స్ శృతి హాసన్, అక్షర హాసన్ లకు తల్లి కన్నా తండ్రితోనే చనువెక్కువ. ఎందుకంటే కమల్ హాసన్ హిందీ నటి సారికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించిన కొన్నాళ్లకే విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. సారిక ముంబై వెళ్లిపోయి ఉంటుంది. శృతి హాసన్, అక్షర హాసన్ ముంబైలోనూ, చెన్నైలోనూ ఉంటున్నారు. ఈ ఇద్దరికీ తల్లికన్నా తండ్రి దగ్గరే ఎక్కువ చనువుంది. తండ్రి కమల్ హాసన్ మాట ప్రకారమే ఇద్దరూ కూడా సినిమా రంగాన్ని ఎంచుకున్నారు.

కమల్ హాసన్ ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పి తమిళనాట రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ఈ విషయం గురించి ప్రస్తుతం తానేమి మాట్లాడలేనని శృతి హాసన్ చెబుతోంది. తెలుగులో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్నకు జవాబిస్తూ మంచి పాత్రలు, మంచి సంస్థలు, దర్శకులు రావడం లేదు. కాబట్టే నటించడం లేదని చెబుతోంది శృతి హాసన్.

అయితే ఆమధ్య ఒక విదేశీయుడితో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అతని పేరు మైఖేల్ కోర్సల్. వృత్తి ఫోటోగ్రఫీ. అయితే ఇప్పటికే శృతి హాసన్ ఈ విదేశీయుడితో ముంబైలో సహజీవనం చేస్తోందట. పెళ్లైనట్టు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. ఈమధ్య పెళ్లి గురించి అడిగినప్పుడు తండ్రిలాగే తాను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే శృతి హాసన్ ప్రేమించి, పెళ్లి కూడా చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఎంతైనా ఈ విషయంలో శృతి హాసన్ కు ఆదర్శం తండ్రేనట.

Similar News