తెలుగులో, తమిళంలో హిట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి సురేష్.. అందానికి అందం, నటనకు నటన.. ఇలా అన్నిటిలో మేటి నటిగా టాప్ హీరోయిన్స్ కి పోటీనిస్తూ టాప్ పొజిషన్ కి వచ్చేసింది. అలాగే మొదటినుండి తన సినిమాల విషయంలో గాని... పాత్ర ల ఎంపిక విషయంలో గాని, గ్లామర్ ఆరబోసే విషయంలో గాని కీర్తి సురేష్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అజ్ఞాతవాసి సినిమా విషయంలో మాత్రమే కీర్తి సురేష్ లెక్క తప్పింది కానీ... ఇప్పటికి కీర్తి పొజిషన్ లో ఎలాంటి మార్పు రాలేదు. అలాంటి కీర్తి సురేష్ మీద ఇప్పటివరకు ఎటువంటి గాసిప్స్ లేవు.
కానీ తాజాగా కీర్తి సురేష్ మీద ఒక న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్ మీడియా లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే... కీర్తి సురేష్ కి వచ్చిన క్రేజ్ వలన ఆమెకు గర్వం ఎక్కువైందని... చేతిలో ఉన్న స్టార్ హీరోల సినిమా అవకాశాలతో ఆమె రెచ్చిపోతుందని అంటున్నారు. సినిమా షూటింగ్ కి కరెక్ట్ టైం కి వచ్చేసినప్పటికీ వచ్చిన దగ్గరనుండి షూటింగ్ స్పాట్ కి వెళ్లకుండా కార్ వ్యాన్ లోనే టైం గడిపేస్తుందని... ఆమె వలన దర్శక నిర్మాతలే కాకుండా హీరోలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే టాక్ కాస్త గట్టిగానే వినబడుతుంది. అంతా నా ఇష్టం అన్నట్లుగా కీర్తి వ్యవహారం మారిపోయిందని అంటున్నారు.
షూటింగ్ కి 9 కన్నా ముందే వచ్చేసినా కార్ వ్యాన్ లోనే రెండు గంటలపాటు రెస్ట్ తీసుకుని దాదాపు 11 సమయంలోనే లొకేషన్ కి వస్తుందట కీర్తి సురేష్. టాప్ రేంజ్ లోకొచ్చాక ఇలాంటి వ్యవహారాలతో తలనొప్పి తెచ్చుకుంటే... రేపు ఆమె కెరీర్ పరిస్థితి ఏమిటి. సినిమా ఫీల్డ్ లో ఏదో పది కాలాలపాటు నెగ్గుకురావడానికి పూర్తి క్రమ శిక్షణ కావాలి గాని.. ఇలా తల పొగరు నెత్తినెక్కించుకుని ఫోజు కొడితే ఇండస్ట్రీ నుండి కనుమరుగవడానికి ఎంతో సమయం పట్టదు బేబీ అంటూ కామెంట్స్ పడుతున్నాయి.