అంతా నమ్రత చేతుల మీదుగానే..

Update: 2017-09-09 16:14 GMT

మహేష్ బాబు చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తాడు. భార్య పిల్లలతో సరదాగానే గడుపుతాడు గాని బయట మాత్రం చాలా సిగ్గరి. సినీపరిశ్రమలో కూడా మహేష్ కి చాలా తక్కువమంది స్నేహితులే ఉన్నారు. అలాగే అవార్డు ఫంక్షన్స్ కిగాని ఇతరుల ఫంక్షన్స్ కి గాని పెద్దగా అటెండ్ కూడా కాడు. అసలు ఇతరుల విషయాల్లో మహేష్ పెద్దగా జోక్యం చేసుకోడు. అలాగే మహేష్ కి సంబందించిన ఏ విషయమైనా భార్య నమ్రత దగ్గరికి వచ్చిన తర్వాతే మహేష్ దగ్గరికి వెళుతుందనే టాక్ వుంది. అయితే మహేష్ బయటిహీరోలు మంచి సినిమాలు చేసి అది తనకు నచ్చినా.... సైలెంట్ గానే ఉంటాడు తప్ప పెద్దగా పొగడడం గట్రా చెయ్యదు. ఒక్క బావ సుధీర్ సినిమాలను ప్రమోట్ చెయ్యడం కోసమే ఎక్కువగా సోషల్ మీడియాని వాడుతాడు.

అయితే ఇప్పుడు మహేష్ కొత్తగా ఒక సినిమా గురించి చేసిన ట్వీట్ మాత్రం ఫిలింనగర్ లో వేడి వేడి చర్చ నడుస్తుంది. అదేమిటంటే అర్జున్ రెడ్డి సినిమా చాలా బావుందంటూ మహేష్ బాబు ఆ సినిమా చూసాక ట్విట్టర్ లో స్పందించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి హీరో విజయ్, దర్శకుడు సందీప్ రెడ్డి, హోల్ టీమ్ మొత్తాన్ని ప్రశంసిస్తూ పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఎప్పుడూ ఏ సినిమా గురించి ఇంతిలా స్పందించని మహేష్ ఇలా అర్జున్ రెడ్డి సినిమాపై ప్రశంశల జల్లు కురిపించడంతో అందరూ దాదాపు అవాక్కయ్యారు. అయితే ఇదంతా అర్జున్ రెడ్డి దర్శకుడితో సినిమా చేస్తున్నాని చెప్పడానికే మహేష్ ఇలా చిన్న హింట్ ఇచ్చాడంటున్నారు.

మహేష్ కు సందీప్ తో సినిమా చేసే ఆలోచన ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది. ఎందుకంటే మహేష్ - సందీప్ రెడ్డి ల మీటింగ్ సెట్ చేయడానికి మహేష్ భార్య నమ్రత కీలకంగా వ్యవహరించినట్లుగా అర్జున్ రెడ్డి దర్శకుడు చెప్పే దాని బట్టి అర్ధమవుతుంది. సందీప్ చెప్పిన దాని ప్రకారం త్వరలోనే మహేష్ ని కలవబోతున్నట్లుగా....ఈ విషయంలో నమ్రతగారు హెల్ప్ చేసినట్లుగా చెబుతున్నాడు. ఇక మహేష్ తో చర్చలకు సిద్ధంగా ఉండమని నమ్రత, సందీప్ వంగాకి చెప్పినట్లుగా చెబుతున్నాడు. అంటే సందీప్.. మహేష్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడనుకోవచ్చా..? చూద్దాం మహేష్ తో సందీప్ రెడ్డి మీట్ ఎలా వుండబోతుందో..?

Similar News