అంత హిట్ కొట్టినా అవకాశాలు నిల్

Update: 2018-03-08 05:22 GMT

పిఎస్వీ గరుడ వేగా సినిమా వచ్చి చాన్నాళ్లు అయ్యింది. రాజశేఖర్ కి, దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు హోల్సేల్ గా బంపర్ హిట్ ఇచ్చింది ఈ సినిమా. గతంలో చందమామ కథలు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ సత్తారుకు మళ్ళీ గరుడ వేగా హిట్ కొట్టడానికి చాలా కాలమేపట్టింది. కానీ ఆ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నా.. ఇప్పటివరకు ప్రవీణ్ సత్తారు కొత్త సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. గరుడ వేగా హిట్ తర్వాత మరో కొత్తరకం కథని రెడీ చేసుకున్న ఈ దర్శకుడు సినిమా ల మీద పిచ్చితో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలేసి సినిమా డైరెక్టర్ అవతారం ఎత్తాడు.

మరి చాలా సినిమాల డైరెక్షన్ సినిమాల అనుభవం ఉన్న ప్రవీణ్ సత్తారుకి చందమామ కథలు, గరుడావెగా సినిమాలు తప్ప మధ్యలో వచ్చిన సినిమాలేవీ గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. గరుడావెగా తో ఫామ్ లోకొచ్చిన ప్రవీణ్ సత్తారు ఆ తర్వాతి ప్రాజెక్ట్ ని ఆ హీరో తో చేస్తున్నాడు ఈ హీరోతో చేస్తున్నాడు అనే టాక్ బాగా నడిచింది. కానీ హీరోలెవరు ప్రవీణ్ పనితనాన్ని నమ్మి సినిమా చెయ్యమనలేదు. ఇక ప్రవీణ్ ప్రస్తుతం ప్లాప్స్ తో సతమతమవుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పట్టేసాడు. ప్రస్తుతం రామ్.. త్రినాథ రావు నక్కినతో ఒక సినిమా చేస్తున్నాడు.'

మరి ప్రవీణ్ సత్తారు మొన్నీమధ్యనే సుధీర్ బాబు హీరోగా పుల్లెల గోపీచంద్ బయో ని తెరకెక్కించడానికి అన్ని రెడీ చెయ్యడమే కాదు... సినిమాని ముహూర్త షాట్ తో మొదలెట్టేసాడు కూడా. రామ్ ఖాళీ అయ్యేలోపులో ప్రవీణ్ మరి పుల్లెల గోపీచంద్ సినిమాని పూర్తి చేసేసి రామ్ కోసం రెడీ అవ్వాలని అనుకుంటున్నాడట. చూద్దాం ప్రవీణ్ సత్తారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది.

Similar News