టాలీవుడ్ లో శ్రియ శరణ్ టైం అయ్యిపోయింది. ఆమె గత 16 , 17 ఏళ్లగా సినిమాల్లో నటించి ఇప్పుడు ఫెడవుట్ అయినా హీరోయిన్, ఇక ఆమెకు సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు అంటూ రకరకాలా కథనాలు ప్రచారం అయ్యాయి. నిజంగానే శ్రియ కూడా సినిమా అవకాశాలు లేక అవార్డు ఫంక్షన్స్ కి వాటికి హాజరవుతూ ఖాళీ అయ్యింది. కాకపోతే గత ఏడాది డైరెక్టర్ క్రిష్ ఆమెకి మరో అవకాశం ఇచ్చి శ్రియ కెరీర్ ని అనూహ్యమైన మలుపు తిప్పాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ పక్కన నటించి ఆ సినిమాతో సక్సెస్ అందుకుంది. కానీ కుర్ర హీరోలపక్కన చాన్సులైతే రావడంలేదుగాని.... మళ్ళీ బాలకృష్ణే మరో ఛాన్స్ 'పైసా వసూల్' లో ఇచ్చాడు. పూరి డైరెక్షన్ లో శ్రియ బాలకృష్ణ తో మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకుంది.
35 వయసులోనూ శ్రియ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉందని 'పైసా వసూల్' ప్రోమో సాంగ్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. అలాగే శ్రియ తాజాగా బాలీవుడ్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో అందాలా ఆరబోతతో రెచ్చిపోయింది. అక్కడ ఆ లాక్మే ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది శ్రియ. ఆ షోలో రాంప్ వాక్ చేసిన యంగ్ హీరోయిన్స్ సైతం శ్రియ అందాల ఆరబోత ముందు తేలిపోయారనే చెప్పాలి. ఆ రేంజ్లో శ్రియ గ్లామర్ షో చేసింది.
అలాగే లాక్మే ఫ్యాషన్ వీక్ లో గెస్ట్ కింద హాజరయిన శ్రియ అందాలకు అందరికి దిమ్మతిరిగింది అంటే నెమరేమో.... మరి లాక్మే ఫ్యాషన్ వీక్ లో శ్రియ వేసిన డ్రెస్ చూసిన తర్వాత అయినా నమ్మకపోతే బావుండదేమో. మరి ఇంత హాట్ గా చెలరేగిపోతున్న శ్రియ కు ఇప్పుడు సౌత్ లో 'పైసా వసూల్' తప్ప మేరె చిత్రము చేతిలో లేదు. ఇక ఆ చిత్రం కూడా సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధంగా వుంది.