నాగ చైతన్య సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాల షూటింగ్ తో పిచ్చ బిజీగా వున్నాడు. ఇక ఆయన భార్య సమంత కూడా రంగస్థలం షూటింగ్ పూర్తయినా... మహానటి, అలాగే కోలీవుడ్ లో రెండు మూడు బిగ్ ప్రాజెక్టులతో యమ బిజీగా వుంది. ఇక నాగ చైతన్య, సమంతలు పెళ్ళికి ముందు నటించినా... పెళ్లి తర్వాత కలిసి నటిస్తారు అనే వార్తలను మొదట్లో నాగ చైతన్య కొట్టిపడేసినా... తాజాగా శివ నిర్వాణం డైరెక్షన్ లో నాగ చైతన్య - సమంతలు ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే గత రెండు నెలలుగా చైతు -సామ్ ల జంట కలిసి శివ నిర్వాణం దర్శకత్వంలో నటిస్తారని ఎన్ని వార్తలొచ్చిన చైతూ మాత్రం అలాంటిదేం లేదని మొదట్లో కొట్టి పారెయ్యడం తర్వాత అధికారికంగా నటిస్తున్నారని న్యూస్ రావడం వెనుక చాలానే జరిగిందనే టాక్ ఉంది.
మొదట్లో నాగ చైతన్య కి శివ చెప్పిన కథ నచ్చి సమంతని కూడా ఒప్పించాడట. కానీ మధ్యలో ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్న సమంత కి తనవరకి తాను పారితోషకం విషయంలో గట్టి పట్టు పట్టుకుని కూర్చున్నాడట. ఇప్పటివరకు తనకి ఒక్కో సినిమాకి మూడు కోట్ల పారితోషకం వస్తుంది.. అలాగే సమంత కూడా దాదాపుగా ఒకటిన్నర కోటి అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఇద్దరికీ కలిపి ఏ ఐదున్నరో.. ఆరు ఇస్తేనే సరిపోదని... తమ కాంబో మీద బోలెడు అంచనాలు ఉంటాయి కాబట్టి తామిద్దరికి కలిపి 7 కోట్ల పారితోషకం కావాలని నాగ చైతన్య డిమాండ్ చేసాడట. అయితే నిర్మాతలైన కోన బ్యాచ్ సందిగ్ధంలో పడడంతోనే చైతు మొదట్లో సామ్ తో కల్సి నటించే విషయం కొట్టిపారేశాడట.
కానీ ఇప్పుడు నాగ చైతన్య - సమంత ల మీదున్న అంచనాల కారణంగా ఆ సినిమా చెయ్యడానికి... నాగ చైతన్య కి సమంత కి కలిపి ఏడు కోట్లు ఇవ్వడానికి కోన బ్యాచ్ ఒప్పుకోవడంతో ఈ సినిమా మీద అధికారిక ప్రకటన వచ్చిందట. మరి ప్రేయసి అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై నిజంగానే ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి