అంజలికి జై కి మధ్యలో..?

Update: 2017-12-19 07:59 GMT

రాజోలు పాప అంజలి తెలుగు అమ్మాయి అయినా.. తమిళ్ లో మాత్రం కెరీర్ ను జెట్ స్పీడ్ లో నడిపించేస్తోంది అంజలి. అయితే మధ్య మధ్యలో అవకాశం వచ్చినపుడు.. తన మాతృభాష తెలుగులో కూడా మెరుపులు మెరిపిస్తూ.. టాలెంట్ చాటుకుంటోంది. తమిళంలో బాగా బిజీగా వున్న ప్రేమ వ్యవహారం నడుపుతుందనే న్యూస్ ఎప్పటినుండో మీడియాలో వినబడుతుంది. కెరీర్ మెదలు పెట్టినప్పటినుండి ఇలాంటి రూమర్స్ ఎదుర్కుంటున్న అంజలి.. తాజాగా తమిళ నటుడు జై తో రిలేషన్ లో ఉందన్న మాట ఎప్పటినుండో ప్రచారంలో ఉంది.

జై ఎక్కడ ఉంటె అక్కడ అంజలి వాలిపోవడం.. ఇద్దరు కలిసి తమ తమ బర్త్ డేస్ ని సెలెబ్రేట్ చేసుకోవడం.. ఇలా రకరకాల విషయాలతో వారిద్దరి మధ్యన ప్రేమ వ్యవహారం ఉందని మీడియా లో వార్తలొచ్చాయి. కానీ తమ మధ్యన ప్రేమ ఉందనే విషయాన్ని అటు అంజలి కానీ.. ఇటు జై కానీ ఎక్కడ కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు జై కి అంజలికి మధ్యన రిలేషన్ విషయమై అంజలి మొదటిసారి పెదవి విప్పింది. అదేమిటంటే... నాకు జై మంచి స్నేహతుడు మాత్రమే. అతనితో ఐదేళ్ల తర్వాత కలిసి మళ్ళీ ఒక సినిమాలో నటిస్తున్నా. మా మధ్య ఉన్న స్నేహాన్ని కించపరుస్తూ ప్రచారం చేస్తున్నారు.

అసలు అలాంటి వదంతులు నమ్మకండి. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. నేను ఎలాంటి భర్తను కోరుకుంటున్నానన్న ఆలోచనలపై కూడా.. నా పెళ్లి సమయంలోనే చెబుతాను. అంతే కానీ నాపై వస్తున్న వదంతులు మాత్రం నమ్మవద్దని కోరుతున్నా అంటూ జై తో ఉన్న రిలేషన్ గురించిన పూర్తి క్లారిటీ ఇచ్చేసింది అంజలి. ఇకపోతే ఇప్పుడు జై తో కలిసి అంజలి నటించిన బెలూన్ సినిమా ఈ నెల 29న విడుదల అవుతోంది.

Similar News