తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో పాగా వేసిన రాజోలు బ్యూటీ అంజలి.... అక్కడి సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఇక్కడ తెలుగులో కూడా అంజలిని అభిమానించేవాళ్లు, ఆరాధించేవాళ్లు ఉన్నారు. కానీ అంజలి అనుకున్నంత అవకాశాలు ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాలేదు. అయితే అంజలి మొదటినుండి... కాస్త బబ్లీగా.. ఛబ్బిగానే ఉండేది.
అలాంటి అంజలి ఇప్పుడు అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ బొద్దుగుమ్మలా ఉన్న అంజలి.. బాగా సన్నగా మారి మెరుపుతీగలా ఫొటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు అంజలి సన్నబడిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటో లో అంజలి తన సన్నిహితులతో సరదాగా కనబడుతుంది. తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న అంజలి.. త్వరలోనే మంచి తెలుగు సినిమా చేయాలని ఆరాటపడుతోంది.
తన మాతృ భాషలో బిజీ కావాలని కోరుకుంటోంది. మరి అంజలి అలా కోరుకునే.. ఇలా బాగా ఫిట్నెస్ సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక తెలుగులో బాగా బిజీగా మారాలనే ట్రయల్స్ లో భాగంగానే.. ఇలాంటి స్టిల్స్ ని సోషల్ మీడియాలో విడుదల చేస్తోందని.. నాజూగ్గా తయారవుతోందని.. కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.