అ! సినిమాకి అదే ప్లస్

Update: 2018-02-19 04:33 GMT

కేవలం వాయిస్ ఓవర్ తోనే సినిమా నిలబడే అవకాశం వుందా. అ! సినిమాలో చేపకి నాని వాయిస్ ఓవర్...చెట్టుకి రవి తేజ వాయిస్ ఓవర్ సినిమాకు హైలైట్ అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. చాలావరకు సీరియస్ గా..కన్ఫ్యూజింగ్‌గా సాగే ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అందించేది నాని, రవి తేజ వాయిస్ ఓవర్ లే..

వంట చేతకాని షెఫ్‌గా ప్రియదర్శి ఇబ్బంది పడుతుంటే అతనికి ఎలా వంట చేయాలో నేర్పిస్తుంది చేప. అలానే ఆ వంట గదిలో చెట్టు ఉంటది ఆ చెట్టుకి రవి తేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇలా సినిమాలో వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చే సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక సీన్లో ప్రియదర్శి ‘వాట్ ద ఫిష్’ అంటే.. బదులుగా ‘వాట్ ద హ్యూమన్’ అంటుంది చేప. ఇలా చాలానే చమత్కారాలు ఉన్నాయిందులో.

ఇక చెట్టు పాత్రలో రవి తేజ పంచులు కూడా బాగానే పేలాయి. ఒక్క సీన్ లో చెట్టు ప్రాధాన్యాన్ని చెబుతూ.. ‘రాఖీ’ సినిమాలో రైల్వేల గురించి ఎన్టీఆర్ పేల్చినట్లుగా ఒక డైలాగ్ పేలుస్తాడు మాస్ రాజా. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ లో తన వాయిస్ తో నాని కళ్ళమ్మట నీళ్లు తెపించాడు. మొత్తానికి వీరి కాంబినేషన్ లేకపోతే సినిమా అంత గొప్పగా ఏమి ఉండదు అని ప్రేక్షకులు అభిప్రాయం.

Similar News