‘అ’ కథ ఎలా పుట్టింది

Update: 2018-02-07 21:30 GMT

కాజల్, నిత్య మీనన్, రెజినా, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్ లాంటి భారీ తారాగణం... రవితేజ, నాని వాయిస్ ఓవర్.. నిర్మాతగా నానినే. ఇంతకు మించి ఏం కావాలి ఒక కొత్త దర్శకుడికి టాలీవుడ్ లో ఎంటర్ అవ్వడానికి. ‘అ’ సినిమాతో తొలి సరిగా డైరెక్షన్ చేయబుతున్నాడు ప్రశాంత్ వర్మ. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో డైరెక్టర్ ప్రశాంత్ ఏమన్నాడో చూధ్ధాం...

ఈ కథకు వాయిస్ ఓవర్ కోసం నాని దగ్గరకు వెళ్తే స్క్రిప్ట్ విని డైరెక్ట్ గా నేనే ప్రొడ్యూస్ చేస్తా.. కంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీయి అని నాని గారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆలా మా జర్నీ స్టార్ట్ అయింది.

కొనేళ్ల కిందటే ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలి. కానీ తనతో సినిమా చేయటానికి అంగీకరించిన నిర్మాతలు..ఉన్నట్లుండి వెనక్కి తగ్గటంతో తాను నిరాశ చెందానని..డిసెంబర్ 31 న రాత్రి పార్టీ క్యాన్సిల్ చేసుకున్నానని.. తాను అలా ఫ్రస్టేషన్లో ఉన్న సమయంలోనే ‘అ’ కథ రాయడం మొదలుపెట్టానని చెప్పాడు ప్రశాంత్ వర్మ. ‘అ’ లాంటి కథ ఇప్పటి దాక టాలీవుడ్ లో రాలేదని.. ప్రతి పది నిమిషాలకు జోనర్ మారిపోతుందని..చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.

Similar News