ఇట్లా అయితే ఎలా?

మహేష్ బాబు యావరేజ్ కథలకే కక్కుర్తి పడుతున్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే భరత్ అనే నేను దగ్గరనుండి మహేష్ బాబు చేసిన మహర్షి, సరిలేరు నీకెవ్వరూ [more]

Update: 2020-02-01 06:03 GMT

మహేష్ బాబు యావరేజ్ కథలకే కక్కుర్తి పడుతున్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే భరత్ అనే నేను దగ్గరనుండి మహేష్ బాబు చేసిన మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలన్నీ ఒకే రీతిలో.. ఒకేరకమయిన కలెక్షన్స్ వస్తున్నాయి. భరత్ అనే నేను కొరటాలతో తీసిన సినిమా కి లీడర్ సినిమాతో పోలికపెట్టడం, ఎంతగా ప్రమోషన్స్ చేసినా యావరేజ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక వంశి పైడిపల్లితో తీసిన మహర్షి సినిమా అంతే. సినిమా హిట్ హిట్ అన్నప్పటికీ… ఆ సినిమా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

తాజాగా సరిలేరు నీకెవ్వరూ కథకి కూడా మహేష్ అలానే కనెక్ట్ అయ్యాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా హిట్ హిట్ అన్నప్పటికీ.. ఆసినిమాకి ఆలా ఆలా కలెక్షన్స్ అంటే నిర్మాతలను సేఫ్ చేసే కలెక్షన్స్ వచ్చాయి. మరి మహేష్ బ్లాక్ బస్టర్ కథలని వినడం లేదా.. లేదంటే మహేష్ అలాంటి కథలే కనెక్ట్ అవుతున్నాడా? లేదా డైరెక్టర్స్ చెప్పే విధానానికి ఇంప్రెస్స్ అయ్యి ఒప్పేసుకుంటున్నాడా అనేది మహేష్ కే తెలియాలి. మరి ఇప్పుడు వంశి ఎలాంటి కథతో ఒప్పించాడో అనేది చూడాలి. కాకపోతే మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఇదవుతున్నారు. మహేష్ కి ఎప్పుడు బ్లాక్ బస్టర్ పడుతుందో అంటున్నారు

Tags:    

Similar News