వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ.. తిరుపతి సెంటిమెంట్ వర్కవుట్ అయిందా ?

తన యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారిటీ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో నంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారా పరిచయమైన విష్ణు..

Update: 2023-02-18 07:43 GMT

vinaro bhagyamu vishnu katha review

సినిమా : వినరో భాగ్యము విష్ణు కథ

నటీనటులు : కిరణ్ అబ్బవరం, కశ్మీరా, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, కేజీఎఫ్ లక్కీ, పమ్మిసాయి, దేవి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, శరత్ లోహితస్వ, ఆమని, తదితరులు
సంగీతం : చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : డేనియల్ విశ్వాస్
దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
నిర్మాత : బన్నీ వాస్
సమర్పణ : అల్లు అరవింద్
విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2023
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. రాజా వారు..రాణివారు, SR కల్యాణమండపం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఇండస్ట్రీలో హీరోగా నిలబడ్డాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత వచ్చిన సమ్మతమే, సెబాస్టియన్ సినిమా ఆశించిన మేర అలరించలేకపోయాయి. తాజాగా కిరణ్ హీరోగా.. తిరుపతి నేపథ్యంలో వచ్చిన సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". కశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాని నిర్మించారు.
కథ
"బాగుండటమంటే మనం బాగుండటం కాదు, పక్కవాళ్లతో బాగుండటమే" అని తన తాత(Subhalekha Sudhakar) చెప్పిన మాటకు కట్టుబడిన కుర్రాడే హీరోవిష్ణు (కిరణ్ అబ్బవరం). అతని స్వస్థలం తిరుపతి. ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఉంటాడు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే తనకు నంబర్ నైబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (హీరోయిన్ కశ్మీరా) దగ్గరవుతుంది. ఆమె ఓ యూట్యూబర్‌. తన యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారిటీ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో నంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారా పరిచయమైన విష్ణు, శర్మ (మురళీ శర్మ)లతో కలిసి వీడియోలు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే విష్ణు, శర్మ ఇద్దరూ దర్శనను ప్రేమిస్తారు. అయితే ఓరోజు దర్శన.. శర్మతో కలిసి లైవ్ మర్డర్ అనే ప్రాంక్ వీడియో చేస్తుంది. కానీ, ఆ ప్రయత్నంలో శర్మ నిజంగానే దర్శన పేల్చిన తూటాకు కుప్పకూలిపోతాడు. దీంతో ఆ హత్య కేసులో దర్శన జైలు పాలవుతుంది. మరి ఈ కేసు నుంచి తన ప్రేయసిని బయట పడేయటం కోసం విష్ణు ఏం చేశాడు?
శర్మను దర్శన నిజంగానే హత్య చేసిందా? ఈ హత్యకు రాజకీయ నాయకుడు (కేజీఎఫ్ లక్కీ)కు ఉన్న లింకేంటి? ముంబయి గ్యాంగ్‌స్టర్‌ రాజన్ (శరత్ లోహితస్వ)కు విష్ణు తన కథ ఎందుకు చెప్పాడు? అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులకు విష్ణు ఎలా సహాయపడ్డాడు? అన్న విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉంది ?
మన పక్కనున్న నంబర్ కు ఫోన్ చేసి పరిచయం పెంచుకోవడం అంటే.. నైబర్ నెంబర్ అనే ఓ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. ప్రేమ కథలో.. క్రైమ్ ఎలిమెంట్, సాయం, దేశభక్తి వంటి సందేశాలను జోడించి.. ఒక థ్రిల్లింగ్ స్టోరీని రాసుకున్నాడు దర్శకుడు మురళి కిషోర్ అలియార్ నందు. అన్నింటినీ మేళవించి.. తెరపై చక్కగా చూపించడంలో డైరెక్టర్ గా మురళి సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా ప్రేమ కథతో సరదాగా సాగిపోగా.. సెకండాఫ్ సస్పెన్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మెప్పిస్తుంది కానీ.. క్లైమాక్స్ కు ముందొచ్చే సీన్ మరీ సిల్లీగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు యదార్థానికి దూరంగా ఉన్నా.. ఆకట్టుకుంటాయి. దీనికి సీక్వెల్ ఉందంటూ.. సినిమాని ముగించడం ఆసక్తికరంగా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
+ కథ
+ కిరణ్ అబ్బవరం నటన
+ మురళీ శర్మ పాత్ర
+ పాటలు
+ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- నిదానంగా సాగే ప్రథమార్థం
- సిల్లీగా అనిపించే ట్విస్టులు
చివరిగా.. వినరో భాగ్యము విష్ణు కథ.. ప్రేక్షకులకు నచ్చుతుంది























Tags:    

Similar News