Leo Movie : లియో ఓటీటీ రిలీజ్ డేట్.. ఎప్పుడు..? ఎక్కడ..?

విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'లియో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Update: 2023-11-20 05:26 GMT

Leo Movie : తమిళ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'లియో'. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, సంజయ్ దత్, త్రిష.. వంటి స్టార్ క్యాస్ట్ నటించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అనుకునంత స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అయినా కలెక్షన్స్ విషయంలో మాత్రం యమా దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్ళింది.

బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.615 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ మోస్ట్ హైపెడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ విడుదల తేదిని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నవంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. మరి థియేటర్ లో మిస్సయిన వారు ఉంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

కాగా ఈ మూవీలో చూపించిన హీరో ఫ్లాష్‌బ్యాక్ ఫేక్ అని చెబుతున్నారు. మూవీ హీరో ఫ్లాష్‌బ్యాక్ ని ఒక ఖైదీ రివీల్ చేస్తాడు. అయితే అతను ఆ స్టోరీని తప్పుగా చెప్పారంటూ చెబుతున్నారు. దీంతో అసలు లియో ఒరిజినల్ స్టోరీ ఏమైంటుంది అని అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. లియో ఒరిజినల్ స్టోరీకి LCUలో ఉన్న ఇతర పాత్రలకు ఏమన్నా లింక్ ఉండబోతుందా..? అనేది కూడా ఆసక్తిగా మారింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజు మాట్లాడుతూ.. ఒక అనాధాశ్రమంలోనే LCU పాత్రలు అన్నిటికి కనెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. విజయ్ పాత్ర, ఫహద్ ఫాజిల్ పాత్ర అక్కడ పరిచయం అవుతాయని చెప్పుకొచ్చారు. అక్కడ పెరిగిన పిల్లలే బయటకి వచ్చిన తరువాత డ్రగ్ మాఫియా మీద ఎలా పోరాటం చేశారు అనేదే LCU స్టోరీ అని చెబుతున్నారు. ఇక LCU మొత్తానికి మెయిన్ విలన్ సూర్య రోలెక్స్ పాత్ర అని తెలియజేశారు. అవెంజర్స్ కి 'థానోస్'లా LCUకి రోలెక్స్ అని పేర్కొన్నారు.


Tags:    

Similar News