Kingdom : రౌడీ బాయ్ రెడీ అవుతున్నాడు.. హిట్ కొట్టి తీరతాడటగా
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరసగా ప్లాప్ లు చవిచూస్తున్నాడు. హిట్ కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది చాలా బాధకలిగించే అంశమే. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. నచ్చిన స్టోరీకి ఓకే చెప్పి వరస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. వరసగా లైగర్, ఫ్యామిలీ మెన్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకులకు ముందుకు వచ్చినా అవి సక్సెస్ కాలేదు. అందుకే రౌడీ హీరో ఎలాగైనా హిట్ కొట్టి తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు.
ఎన్నో ఆశలు...
తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీపై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కింగ్ డమ్ మూవీపై విజయ్ అభిమానులు కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ మూవీతో తిరిగి తాను టాలీవుడ్ కే కాకుండా బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలన్న యోచనలో విజయ్ దేవరకొండ ఉన్నట్లు టాక్. అందుకే అంచనాలు అధికంగా ఉన్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక తిరుగులేదని అని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
మాస్ హీరోగా...
కింగ్ డమ్ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ మాస్ హీరోగా కనిపించబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ నెల 30 వతేదనీ ప్రపంచప వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. అయితే మే 30వ తేదీన వీరమల్లు విడుదల అవుతుందని భావిస్తున్న సమయంలో కింగ్ డమ్ మే 30వ తేదీన విడుదలవుతుందా? లేదా వాయిదాపడుతుందా? అన్న అప్ డేట్ తెలియాల్సి ఉంది.