లావణ్య త్రిపాఠి పేరుని వరుణ్ తేజ్ ఫోన్‌లో ఎలా సేవ్ చేశాడో తెలుసా..?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్ తన ఫోన్‌లో లావణ్య పేరుని ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా..?

Update: 2023-08-23 12:00 GMT

టాలీవుడ్ హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్ (Varun Tej) అండ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వరుణ్ ప్రస్తుతం తను నటించిన కొంత సినిమా ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈక్రమంలోనే మూవీ టీంతో కలిసి వరుణ్ తేజ్ కూడా ఇంటర్వ్యూలు, పలు టీవీ షోల్లో పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న వరుణ్ ని ఒక అభిమాని ఇలా ప్రశ్నించింది.. 'మీ ఫోన్‌లో లావణ్య త్రిపాఠి పేరుని ఎలా సేవ్ చేసుకున్నారు'. దీనికి వరుణ్ బదులిస్తూ.. ''LavN అని సేవ్ చేసి ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు. ప్రేమ మొదలైన తరువాత ఇలా సేవ్ చేశారా? లేక ముందు నుంచే ఇలా సేవ్ చేశారా? అని ప్రశ్నించగా, వరుణ్ సమాధానం ఇస్తూ.. "నా ఫోన్ తీసుకోని లావణ్యనే అలా సేవ్ చేసింది" అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా వరుణ్ అండ్ లావణ్య మొదటిసారిగా 'మిస్టర్' సినిమాలో కలిసి పని చేశారు. ఆ మూవీ టైంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో సినిమా రిలీజ్ తరువాత కూడా టచ్‌లో ఉంటూ వచ్చారు. మళ్ళీ 'అంతరిక్షం' మూవీలో కలిసి నటించే సమయానికి ఇద్దరి మధ్య ప్రేమ మొదలయింది. ముందుగా వరుణ్ తేజే ప్రపోజ్ చేశాడట. దాదాపు 5 ఏళ్ళ పాటు ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రేమాయణం నడుపుతూ వచ్చారు.
జూన్ 9న ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్న ఈ జంట.. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుపుకోనున్నట్లు వరుణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇందుకోసం ఇండియా అండ్ ఫారిన్ కంట్రీస్ లోని కొన్ని ప్లేస్‌లు పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఉన్న మూవీ ప్రమోషన్స్ అండ్ రిలీజ్ అయ్యిపోగానే.. పెళ్లి తేదీ, ప్లేస్ పై ప్రకటన చేస్తామంటూ వరుణ్ తెలియజేశాడు.


Tags:    

Similar News